పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ
జననం1929
జాతీయతభారతీయుడు
జాతిపారిస్
పౌరసత్వంఐర్లాండ్ సభ్యత్వము ( పూర్వము భారతీయ పౌరసత్వము)[1]
వృత్తిషాపూర్‌జీ పల్లోంజీ గ్రూపు అధ్యక్షుడు
టాటా సన్స్ లో 18.4% వాటా
అసలు సంపదUS$16.3 బిలియన్లు (నవంబర్ 2015)[2]
మతంజొరాష్ట్రియన్
జీవిత భాగస్వామిపెళ్ళి అయినది
పిల్లలు4

పల్లోంజీ మిస్త్రీ భారతదేశానికి చెందిన ఒక అంతర్జాజీయ వ్యాపారవేత్త. 2016లో భారత ప్రభుత్వము ఈయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

నేపధ్యము[మార్చు]

పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ భారత్‌లో అత్యంత విజయవంతమైన, శక్తిమంతమైన వ్యాపారవేత్త. భారత్‌, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో విస్తరించి ఉన్న వ్యాపారాన్ని ఒంటిచేత్తో నడిపిన వ్యక్తి. 14.7 బిలియన్‌ డాలర్లతో 2015 ఫోర్బ్స్‌ జాబితాలో ఈయన అయిదో స్థానం దక్కించుకున్నాడు. 2016 నాటికి షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ (ఎస్‌పీజీ) గౌరవ ఛైర్మన్‌గా ఉంటూ.. కంపెనీకి సలహాలనందిస్తున్నాడు. ఎస్‌పీజీ ఎన్ని రంగాల్లో ఉన్నప్పటికీ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18.5 శాతం వాటా వల్లే ఎక్కువ సంపద సమకూరుతోంది. టాటా సన్స్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారులు వీరే. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ పగ్గాలను తన పెద్ద కుమారుడు షాపూర్‌కు అప్పజెప్పారు. ఈయన చిన్న కుమారుడు సైరస్‌ మిస్త్రీ. రతన్ టాటా పదవీ విరమణ అనంతరం టాటా సన్స్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2012 లెక్కల ప్రకారమే పల్లోంజీ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన (రూ.53,000 కోట్లకు పైగా) ఐరిష్‌ వ్యక్తిగా ఫోర్బ్స్‌ కీర్తించింది. ఈ గ్రూప్‌ జౌళి నుంచి స్థిరాస్తి; ఆతిథ్యం నుంచి ఆటోమేషన్‌ దాకా విస్తరించి ఉంది.

తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌, ద ఒబెరాయ్‌ హోటల్స్‌. ఈ రెండింటినీ నిర్మించింది ఎస్‌పీజీ గ్రూపే కావడం విశేషం. ఇంకా ఒమన్‌లో సుల్తాన్‌ ప్యాలెస్‌, ఘనాలో అధ్యక్ష భవనాలు కూడా ఈ సంస్థే నిర్మించింది. ఇద్దరు కుమారులు వ్యాపారాల్లో ఉండగా కుమార్తె ఆలూ (రతన్‌ టాటా సవతి సోదరుడైన నియోల్‌ టాటాను పరిణయమాడారు.) సైతం సైరస్‌తో పాటు టాటా సన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "The Phantom Player". business.outlookindia.com. మూలం నుండి 9 మార్చి 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 23 February 2011. Cite web requires |website= (help)
  2. "Pallonji Mistry". Forbes.com. Retrieved 3 November. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
  3. "పల్లోంజీ మిస్త్రీ". ఈనాడు. 2016-1-26. Retrieved 2016-1-26. Cite web requires |website= (help); Check date values in: |accessdate=, |date= (help)

బయటి లంకెలు[మార్చు]