పసుపులేటి బాలరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసుపులేటి బాలరాజు

పసుపులేటి బాలరాజు (జ.1964 జూన్ 12) భారతతదేశ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. అతను ప్రస్తుతం జనసేన పార్టీకి చెందిన వాడు. అంతకు ముందు అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పని చేసాడు. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా కూడా పనిచేసాడు. [1]

ప్రారంభ జీవితం

[మార్చు]

పసుపులేటి బాలరాజు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన గూడెం కొత్తవీధి మండలంలో జన్మించాడు. అతను అన్నామలై విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసాడు. [2] రాజకీయాలలోకి రాక పూర్వం అతను కండక్టరుగా, ఉపాధ్యాయునిగా, కాఫీ బోర్డు అధ్యక్షునిగా కూడా పనిచేసాడు. తన 25 సంవత్సరాల వయస్సులో రాజకీయ రంగ ప్రవేశం చేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అతను 1989లో చింతపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009లో అతను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లోని పాడేరు శాసన సభ్య నియోజక వర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందాడు. అతను వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. [3]. ఎన్.కిరణకుమార్ రెడ్డి మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసాడు. అతను 2009-2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేసాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతను రాధను వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక సోదరి, ముగ్గురు సోదరులు. అతనికి ఒక కుమార్తె "డా.దర్శిని", కుమారుడు "భగత్" ఉన్నారు.[ఆధారం చూపాలి]

మూలాలు

[మార్చు]