Jump to content

పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ

వికీపీడియా నుండి

పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, కర్ణాటక సంగీత విద్వాంసులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన కూచిపూడి గ్రామంలో ఆగష్టు 27 1929 న జన్మించారు. చిన్ననాటి నుండి కూచిపూడి నాట్యంతో పాటు కర్ణాటక సంగీతంలో కృషిచేసిన ఈయన వేలాది మంది శిష్యులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఆచార్యులు. ఈయన వద్ద శిక్షణ పొందిన వారిలో పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణశర్మ, డాక్టర్ రాజా రాధారెడ్డి, యామిని కృష్ణమూర్తి, మిక్కిలినేని స్వర్ణలత, లంకా అన్నపూర్ణ, పసుమర్తి కేశవప్రసాద్ లబ్ధ ప్రతిష్ఠులయ్యారు.

అవార్డులు

[మార్చు]

కూచిపూడి నాట్యానికి ఎనలేని సేవలందించిన ఈయన కృషిని గుర్తించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ 1987లో ఘనంగా సత్కరించింది.[2] రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును అందచేసింది. ఆయనకు 2009లో సిద్దేంద్రనాటక పురస్కారం లభించింది.[3]

మరణం

[మార్చు]

ప్రముఖ కుచిపూడి నాట్య గురువు, కళాప్రపూర్ణ శ్రీ పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు జూన్ 3 2012హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన కుమారులు పసుమర్తి శేషుబాబు మరియుపసుమర్తి శ్రీనివాస్. వీరుకూడా కూచిపూడి నృత్యకళాకారులు[4]

మూలాలు

[మార్చు]
  1. కళారత్న పివిజి కన్నుమూత, 05/06/2012, andhrabhoomi[permanent dead link]
  2. "sangeetha nataka academy". Archived from the original on 30 మే 2015. Retrieved 7 January 2016.
  3. "Kuchipudi to be converted into 'Shilpakalaramam'". Staff Reporter. The HIndu. January 7, 2009. Retrieved 7 January 2016.
  4. ABOUT THE FOUNDER Smt.D.K.Anurraddhaa, the Founder and Director of Nrithyalaya India,[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]