పాటిల్ వేణుగోపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 - 1985
1989 - 1994
1999- 2004
నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950 మే 25
పల్లేపల్లి, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2022 ఫిబ్రవరి 12
బెంగళూరు
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానం అజరు పాటిల్‌, సింధుజ
వృత్తి రాజకీయ నాయకుడు

పాటిల్ వేణుగోపాల్ రెడ్డి (1950 మే 25 - 2022 ఫిబ్రవరి 12) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాయదుర్గం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి 1950 మే 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా,రాయదుర్గం మండలం, పల్లేపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి 1979లో మల్లాపురం సర్పంచి, రాయదుర్గం పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించి టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు.

పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. వేణుగోపాల్‌రెడ్డి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1994, 2005లో రెండుసార్లు అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పని చేశాడు.

పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం జిల్లా స్థానిక సంస్థల కోటా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫయాజ్ పాషాపై 245 ఓట్ల మెజారిటీతో గెలిచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2012లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం జిల్లా స్థానిక సంస్థల కోటా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

మరణం[మార్చు]

పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2022 ఫిబ్రవరి 12న మరణించాడు. ఆయనకు భార్య పద్మావతి, కుమారుడు అజరు పాటిల్‌, కుమార్తె సింధుజ ఉన్నారు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Telugu One India (17 September 2009). "అనంత ఎమ్మెల్సీ కాంగ్రెసు వశం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  2. Andhra Jyothy (13 February 2022). "మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ కన్నుమూత". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Prajasakti (12 February 2022). "పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి కన్నుమూత". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.