పాడుతా తీయగా (సినిమా)
Jump to navigation
Jump to search
పాడుతా తీయగా | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
నిర్మాత | రామోజీ రావు |
తారాగణం | వినీత్ , హీరా |
సంగీతం | మహేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 28, 1998 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పాడుతా తీయగా క్రాంతి కుమార్ దర్శకత్వంలో 1998లో విడుదలైన చిత్రం. ఇందులో వినీత్, హీరా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించాడు.[1] ఈ చిత్రానికి మహేష్ సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె. ఎస్. చిత్ర, పార్థసారధి పాటలు పాడారు.
సంగీతాన్నే ప్రాణంగా భావించే నలుగురు యువకులు తమను తాము నిరూపించుకోవడం పడే తపన, వాళ్ళ నలుగురికీ ఒక అమ్మాయి ఎలా సహాయం చేసింది అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
తారాగణం
[మార్చు]సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి మహేష్ సంగీత దర్శకత్వం వహించాడు.[2] ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. సంగీతం మయూరి ఆడియో ద్వారా విడుదలైంది. నవతరానికీ అనే పాట మొదట్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలాపన వినిపిస్తుంది.
- మంగళవాద్యం మదిలో మ్రోగింది (గానం: కె. ఎస్. చిత్ర, పార్ధసారథి)
- నవతరానికి నమస్తే యువత జోరుకి
- పాడుతా తీయగా చలాకి పాట (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
- పాట నాకు నేస్తం (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
- ప్రేమ పుట్టిందో
- సరిగమ పదనిస రాగాలే మన వేదాలే (గానం: మనో, పార్ధసారథి)
- తెల్లవారే వేళ నింగి రంగుల్లో (గానం: మనో)
మూలాలు
[మార్చు]- ↑ "Padutha Theeyaga (1998)". Indiancine.ma. Retrieved 2020-09-08.
- ↑ "Padutha Theeyaga(1998), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Archived from the original on 2016-03-03. Retrieved 2020-09-08.