పాతూరి సుధాకర్ రెడ్డి
Appearance
పాతూరి సుధాకర్ రెడ్డి | |||
| |||
మాజీ ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2007 నుండి 2019 | |||
నియోజకవర్గం | మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
నివాసం | పోరెడ్డిపల్లి గ్రామం, కోహెడ మండలం , కరీంనగర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
పాతూరి సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2007, 2013లో రెండుసార్లు గెలిచి ఎమ్మెల్సీగా పని చేశాడు. ఆయన 2016లో తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యాడు.[1]
జననం
[మార్చు]పాతూరి సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం, పోరెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు.
వృత్తి జీవితం
[మార్చు]సుధాకర్ రెడ్డి 1968 నుంచి 2005 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్‌టీయూ) నేతగా, 1975 నుంచి పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | ప్రత్యర్థి | మెజారిటీ (ఓట్లు) | ఫలితం | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2007 | మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం | - | - | గెలుపు | |
2013 | మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ( తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా) | - | - | గెలుపు | |
2019 | మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం (స్వతంత్ర అభ్యర్థిగా) | - | - | ఓటమి | [2] |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (28 August 2016). "మండలి చీఫ్ విప్‌గా పాతూరి". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
- ↑ 10TV (27 March 2019). "MLC Elections : అధికార పార్టీలకు ఎదురుదెబ్బ". 10TV (in telugu). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)