పాముల రాజేశ్వరి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాముల రాజేశ్వరి దేవి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం పి.గన్నవరం నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం నగరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నివాసం తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

పాముల రాజేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2009లో గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

రాజకీయ జీవితం[మార్చు]

పాముల రాజేశ్వరిదేవి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయ్యాజీ వేమా పై 9281 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన భాగంగా నూతనంగా ఏర్పడిన పి.గన్నవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి పి.గన్నవరం తొలి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది. రాజేశ్వరి దేవి 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 22 ఏప్రిల్ 2017లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[1] ఆమె 8 అక్టోబర్ 2018లో జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (22 April 2017). "వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Asianet News (23 March 2019). "నాడు చిరు పార్టీని ఓడించి, నేడు తమ్ముడి పార్టీ నుంచి పోటీ: గెలుపుపై మాజీ ఎమ్మెల్యే ధీమా". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.