Jump to content

పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం

వికీపీడియా నుండి


పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం
పేరు
ప్రధాన పేరు :పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జనగాం
ప్రదేశం:పాలకుర్తి మండలంలోని, పాలకుర్తి గ్రామం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సోమేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కాకతీయ, చాళుక్య; హిందూ


జనగాం జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రం. శివారాధకులకు,వీరశైవులకు దర్శనీయ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీనర్సింహాలయాలు ఉన్నాయి. శివ కేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజసిద్ధంగా వెలిశారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం ఉన్నది. .ప్రతియేటా మహాశివరాత్రి నుండి అయిదు రోజులపాటు ఇక్కడ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.యాత్రికుల వసతికి గదులు,మంచినీటి సౌకయం ఉన్నది.


మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]