పాలిచెర్ల రవి కిరణ్‌కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలిచెర్ల రవి కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి.[1] అత్యంత ప్రజాదరణ పొందిన వైయస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి అతను ఇంచార్జీగా వ్యవహరించాడు. ప్రభుత్వ సహాయం కావాల్సిన నిరుపేదలందరికీ సహాయం చేసేందుకు అతను ముందుండేవాడు.

జివిత విశేషాలు[మార్చు]

నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామానికి చెందిన కిరణ్ సీఏ అభ్యసించి తొలుత బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆ తరువాత బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఏడిగా పనిచేశారు. సెర్ప్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా కూడా పనిచేవారు. 2004లో వై.ఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు.[2] వై.ఎస్ మరణం తరువాత కొంత కాలం విజయమ్మకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు అందులో తొలి కోశాధికారిగా నియుక్తులయ్యారు.

ఆరోగ్యశ్రీలో పాత్ర[మార్చు]

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి ఖరీదైన కార్పోరేట్ వైద్యం సులభంగా అందేందుకు కృషి చేసిన మానవతావాది.. ప్రజా శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా భావించిన అతికొద్ది మంది అధికారుల్లో ఒకరాయన. పేద ప్రజలకు ఆరోగ్య సిరిసంపదలను విజయవంతంగా అందించిన వ్యక్తి.. ప్రజా ఆరోగ్యం బాగుపడటానికి అనుక్షణం శ్రమించిన శ్రామికుడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేసి ఎందరో అధికారులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వ్యక్తి. ప్రజా సమస్యలకు సెలవుండదని ప్రగాఢంగా విశ్వసించిన ఆరోగ్యశ్రీ రూపశిల్పి ఆయన.[3]

మరణం[మార్చు]

క్యాన్సర్ వ్యాధితో కొద్ది నెలలుగా చికిత్స పొందుతున్న కిరణ్ డిసెంబరు 25 2012 మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత 12.21 గంటలకు అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య (శాంతి), ఒక కుమార్తె (ఐక్య) ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. Rest in peace Sri Kiran Kumar Reddy Garu
  2. "'ఆరోగ్యశ్రీ' కిరణ్ ఇకలేరు!". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-02.
  3. 'ఆరోగ్యశ్రీ’ కిరణ్ ఇకలేరు![permanent dead link]

ఇతర లింకులు[మార్చు]