దామరమడుగు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దామరమడుగు
—  రెవిన్యూ గ్రామం  —
దామరమడుగు is located in ఆంధ్ర ప్రదేశ్
దామరమడుగు
అక్షాంశరేఖాంశాలు: 14°30′06″N 79°55′55″E / 14.501624°N 79.931928°E / 14.501624; 79.931928
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం బుచ్చిరెడ్డిపాలెము
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,294
 - పురుషుల సంఖ్య 3,657
 - స్త్రీల సంఖ్య 337
 - గృహాల సంఖ్య 1,990
పిన్ కోడ్ 524137
ఎస్.టి.డి కోడ్ 08622
దామరమడుగు శివాలయం

దామరమడుగు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెము మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 524 137 ., ఎస్.టి.డి.కోడ్ = 08622.

 • ఈ గ్రామ ప్రజలు ముఖ్య వృత్తి వ్యవసాయము. ఈ గ్రామం జనాభా పరంగానూ, వైశాల్య

పరంగానూ కొంచెం పెద్దది. నెల్లూరు కడప రహదారి పై, నెల్లూరు నుంచి 7 మైళ్ళ దూరంలో బుచ్చి, నెల్లూరు మధ్యలో ఈ గ్రామం ఉంది. చారిత్రాత్మకంగా ఈ గ్రామం కమ్యూనిస్టులకు భావాలకు ప్రసిద్ధిగాంచింది. ఎంతోమంది కమ్యూనిస్టు భావాలతో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంవైపు మళ్ళించారు.నెల్లూరు, బుచ్చి ల మధ్య వుండి ఈ నాటికీ ఇక్కడ పొలీస్ స్టేషను గాని, ఆసుపత్రి గాని లేకుండా, అసలా అవసరమే లెకుండా ఈ గ్రామం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. పోలీస్ స్టేషను లేకపోవటానికి కారణం ఇక్కడి ప్రజలు తమ సమస్యలు తమకు తాముగా పరిష్కరించుకొవటమే అయితే, ఆసుపత్రి లేకపోవటానికి ఈ గ్రామం చాలా సులభంగా నెల్లూరు, బుచ్చి లకు కనెక్ట్ అయి ఉండటమే.

 • తమ గ్రామములో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసుకోవాలనే పట్టుదలతో, గ్రామస్తులంతా కలసి చందాలు వేసుకొని ప్రభుత్వ మంజూరు తెచ్చుకుని, కళాశాలకు స్థలం కొనుక్కొని,, భవన నిర్మాణానికై, 12 సెప్టెంబరు 2013 నాడు శంకుస్థాపన చేసుకున్నారు. దాతలలో ముఖ్యులు, శ్రీ కొండా చంద్రమోహన రెడ్డి. ఈయన ఒక్కడే 30 లక్షల రూపాయల చందా ఇచ్చి తన దాతృత్వం చాటుకున్నారు. తమ తండ్రి కీర్తి శేషులు కొండా కోటారెడ్డి పేరుమీద ఈ విరాళం అందజేశారు. [1]
 • ఈ గ్రామములో ఒక శివాలయం ఉంది.

మూలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,294 - పురుషుల సంఖ్య 3,657 - స్త్రీల సంఖ్య 337 - గృహాల సంఖ్య 1,990

 • విస్తీర్ణం 1146 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • పాతూరు 4 కి.మీ
 • ఇసకపాలెం 5 కి.మీ
 • జొన్నవాడ 5 కి.మీ
 • రేబాల 6 కి.మీ
 • కొండ్లపూడి 6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • తూర్పున కోవూరు మండలం
 • తూర్పున నెల్లూరు మండలం
 • తూర్పున కొడవలూరు మండలం
 • దక్షణాన నెల్లూరు రూరల్ మండలం

[1] ఈనాడు నెల్లూరు,13 సెప్టెంబరు-2013. 7వ పేజీ.

ప్రముఖులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దామరమడుగు&oldid=2002760" నుండి వెలికితీశారు