Jump to content

పాలెపు సీతారామ కృష్ణ హరనాథ్

వికీపీడియా నుండి

పాలెపు సీతారామ కృష్ణ హరనాథ్ (పి.ఎస్.ఆర్.కె.హరనాథ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మకాలజీ వైద్య శాస్త్రవేత్త.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన విజయనగరం జిల్లా గజపతినగరం లో నవంబరు 9 1927 న జన్మించారు[1]. ఆయన తండ్రి పేరు గుంపస్వామి పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. హరనాథ్ ఎం.ఎ చదివి ఫార్మకోలజీలో డి.ఎస్.సి పట్టాను పొందారు. 1952లో ఎం.డి చేసారు. మద్రాసు మెడికల్ కాలేజీ స్టేన్లీ మెడికల్ కాలేజీ లో 17-2-1951న ప్రొఫెసర్ గా చేరారు. గుంటూరు మెడికల్ కళాశాల, ఆంధ్రా కళాశాలలలో ఫార్మకాలజీ అసిస్టెంటు ఫ్రొఫెసరుగా (1951 -57) కర్నూలు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ గా (1957-79) పనిచేసారు. మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాదు కు అడిషనల్ డైరక్టరుగా (1978-81), డైరక్టరుగా(1981-83), శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫాకల్టీ ఆఫ్ మెడికల్ విభాగానికి డీన్ గా, 1975 లో కర్నూలు మెడికల్ కాలేజీ ఫార్మకోలజీ విభాగానికి ప్రొఫెసరుగా, ప్రిన్సిపాలుగా పనిచేసారు.[2]

సేవలు

[మార్చు]

ఔషథ విజ్ఞాన శాస్త్ర సంబంధిత పరిశోధనలు అనేకం చేసారు. ఔషఠ నిర్మాణ శాస్త్రాన్ని అభివృద్ధి చేసారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్; ఆంధ్రప్రదేశ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ సంస్థల ఫెలోషిప్ అందుకున్నారు. బ్రిటిష్ ఫార్మకాలజీ సొసైటీ సభ్యులుగా, ఇండియన్ ఫార్మకాల్జీ సొసైటీ అధ్యక్షులుగా 91977), అసోసియేషన్ ఆఫ్ ఫిజియోలసిస్ట్స్ అండ్ ఫార్మకోలజిస్ట్స్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఘన కీర్తిని పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి డి.ఎస్.సి (గౌరవ పట్టా) ని , డా.బి.సి.రాయ్ నేషనల్ అవార్డు(1978) ని అందుకున్నారు[1].

వైద్య శాస్త్ర పుస్తకాలను రచించారు. వైద్యపుస్తకాలను ప్రచురించారు.[3] ఈయన రచనల ఆధారంగా అనేక వైద్య పుస్తకాలు ప్రచురించబడ్డాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Fellows of APAS" (PDF). apas.org.in/. Archived from the original (PDF) on 6 ఆగస్టు 2016. Retrieved 14 February 2016.
  2. "Department of Pharmacology". Archived from the original on 2016-03-07. Retrieved 2016-02-14.
  3. P.S.R.K HARANATH పుస్తకాల వివరాలు[permanent dead link]
  4. Adrenergic Mechanisms By CIBA Foundation Symposium

ఇతర లింకులు

[మార్చు]