పిఆర్ మన్ సింగ్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1937/1938 (age 86–87)[1] | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1965/66 | హైదరాబాదు క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2019 డిసెంబరు 26 |
పిఆర్ మన్ సింగ్, భారత మాజీ క్రికెటర్. 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు, 1987 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు మేనేజర్ గా విధులు నిర్వహించాడు. తరువాత కొంతకాలం హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు.
క్రీడారంగం
[మార్చు]కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఆఫ్ బ్రేక్ బౌలరైన మన్ సింగ్ 1965/66, 1968/69 మధ్యకాలంలో ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. రంజీ ట్రోఫీలో హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొయిన్-ఉద్-డౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్‌లో హైదరాబాదు బ్లూస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. [2]
క్రికెటర్ గా పదవీ విరమణ చేసిన తరువాత నిర్వాహకుడిగా మారాడు. 1978లో పాకిస్తాన్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు సహ నిర్వాహకుడిగా పనిచేశాడు.[1] బిసిసిఐ సర్వసభ్య సమావేశంలో నిరంజన్ షాపై 15–13 తేడాతో గెలిచి, 1983 క్రికెట్ ప్రపంచ కప్‌కు మేనేజర్‌గా ఎంపికయ్యాడు.[3] కపిల్ దేవ్‌ను ఈ టోర్నమెంట్‌కు కెప్టెన్‌గా నియమించిన ఆరుగురు సభ్యుల ఎంపిక కమిటీలో మన్ సింగ్ ఒకడు; అప్పుడు ప్రపంచ కప్ జట్టు ఎంపికలో మన్ సింగ్, కపిల్ దేవ్ పాల్గొన్నారు.[1] భారత జట్టు టోర్నమెంట్ ప్రారంభంలో మామూలుస్థాయిలో నిలిచినప్పటికీ, చివరికి ప్రపంచ కప్ ను గెలిచింది.[4]
భారతదేశం ప్రపంచ కప్ విజయం తరువాత, విస్డెన్ క్రికెట్ మంత్లీ ఎడిటర్ డేవిడ్ ఫ్రిత్ కు మన్ సింగ్ ఒక లేఖ రాశాడు. ప్రపంచ కప్ కు ముందు భారతదేశ గెలుపు అవకాశాలను తక్కువ చేసి మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ కప్ గెలిస్తే "తన వ్యాఖ్యలను తాను తింటానని" డేవిడ్ ఫ్రిత్ ప్రకటించాడు. 1983 సెప్టెంబరు ఎడిషన్ లో మన్ సింగ్ లేఖతోపాటు నోటిలో కాగితపు ముక్కతోవున్న ఫ్రిత్ ఫోటోను, "భారతదేశం నా వ్యాఖ్యలను నేనే తినేలా నన్ను చేసింది" అనే శీర్షికతో ప్రచురించింది.[5][6][7]
1987లో భారతదేశంలో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారతజట్టుకు మన్ సింగ్ మేనేజర్ గా ఉన్నాడు. తరువాత, మొయిన్-ఉద్-దోహ్లా టోర్నమెంట్ లో హైదరాబాదు బ్లూస్ ను ప్రాతినిధ్యం వహించాడు. హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. [6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సికింద్రాబాదులోని కార్ఖానలో ఉన్న మన్ సింగ్ నివాసానికి "పెవిలియన్" అని పేరు పెట్టారు. ఇందులోని క్రికెట్ మెమోరాబిలియా గదిని 2003లో సచిన్ టెండుల్కర్ ప్రారంభించాడు. 1950ల నుండి వందలాది పుస్తకాలు ఇందులో ఉన్నాయి.[6][8]
ఇతర వివరాలు
[మార్చు]భారతదేశ ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా ఆధారంగా 2021లో రూపొందించిన '83 సినిమాలో మన్ సింగ్ పాత్రను పంకజ్ త్రిపాఠి పోషించాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Lokapally, Vijay (జూన్ 26 2019). "When manager flouted Board rules". Sportstar. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ "Man Singh". CricketArchive. Archived from the original on 22 జూలై 2021. Retrieved జూలై 22 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ Subrahmanyam, V. V. (మే 25 2019). "I enjoyed every bit of my role, says 1983 cricket World Cup manager Man Singh". The Hindu. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ https://www.espncricinfo.com/story/the-year-everything-changed-355230
- ↑ "1983 WC triumph: did you know?". News18. జూన్ 25 2010. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ 6.0 6.1 6.2 "PR Man Singh: One-man treasure trove of cricket tales and memorabilia". Cricbuzz. డిసెంబరు 22 2015. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ "When Kapil's Devils made a scribe eat his words". DNA India. జూన్ 21 2008. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ Das, Jagannath (జూలై 5 2019). "Chattis saal baad…Man Singh has it all". Telangana Today. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ "Pankaj Tripathi on meeting manager Man Singh for 83: Got emotional listening to his life journey". ఇండియా Today. జూలై 4 2019. Retrieved జూలై 22 2021.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help)
బయటి లింకులు
[మార్చు]- క్రిక్ఇన్ఫో లో పిఆర్ మన్ సింగ్ ప్రొఫైల్