పిట్టువారిపాలెం
స్వరూపం
పిట్టువారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°49′47.136″N 80°24′37.404″E / 15.82976000°N 80.41039000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చీరాల |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిట్టువారిపాలెం బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబీకులైన పిట్టు వెంకటరావు+నాగేశ్వరమ్మల కుమారుడైన ఏసుబాబు పదవ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ ఇతడు ఆటలలో ఘనాపాఠీ. మొదట ఖో-ఖో, అథ్లెటిక్సులో రాణించిన ఇతడు, తరువాత వెయిట్ లిఫ్టింగులో సాధన చేసి, అంచెలంచెలుగా పైకి వచ్చి, మొదటి ప్రయత్నంలోనే, రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించాడు. విజయవాడలో 2013 నవంబరు 23,24 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగు పోటీలలో, 16 జిల్లాల క్రీడాకారులతో పాటు పాల్గొని, స్నాచ్ లో 60 కె.జి.లూ, క్లీన్ & జెర్క్ లో 85కె.జి.ల బరువులను సునాయాసంగా ఎత్తి, బంగారు పతకం సాధించాడు. జిల్లాలో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు ఇతడొక్కడే. ఈ రకంగా పిన్నవయసులోనే ఇతడు, త్వరలో రాంచీలో జరుగు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించాడు. ఇతడు ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన పైకా వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, 56 కేజీల విభాగంలో పాల్గొని, క్లీన్ & జెర్క్ లో 100కేజీలు, స్నాచ్ లో 65 కేజీల బరువు ఎత్తి, మొదటి స్థానంతోపాటు బంగారు పతకాన్ని గూడా కైవసం చేసుకున్నాడు.