పినపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలనాటి మేటి మా పినపళ్ల గ్రామస్తులు.jpg
పినపళ్ళ
—  రెవిన్యూ గ్రామం  —
పినపళ్ళ is located in Andhra Pradesh
పినపళ్ళ
పినపళ్ళ
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°47′00″N 81°54′00″E / 16.7833°N 81.9000°E / 16.7833; 81.9000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ఆలమూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,227
 - పురుషులు 1,637
 - స్త్రీలు 1,590
 - గృహాల సంఖ్య 908
పిన్ కోడ్ 533232
ఎస్.టి.డి కోడ్

పినపళ్ళ, తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలానికి చెందిన గ్రామము.[1].

ఇది మండల కేంద్రమైన ఆలమూరు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మండపేట నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 908 ఇళ్లతో, 3227 జనాభాతో 308 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1637, ఆడవారి సంఖ్య 1590. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 352 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 11. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587659[2].పిన్ కోడ్: 533232.

విద్యా సౌకర్యాలు[మార్చు]

అలనాటి మేటి మా పినపళ్ల గ్రామస్తులు2.jpg

చరిత్ర:- 

స్వర్గీయ బ్రహ్మశ్రీ విస్సా వీరభద్ర ప్రసాద రావు గారు ఆ గ్రామంలో ఒక పాఠశాల ప్రారంభించారు. గ్రామంలో పిల్లలని చేరదీసి చదువు చెప్పేవారు. అదే గ్రామంలో మొట్టమొదట బడి

మెండు, సంగీత తదితర ప్రఖ్యాత వంశ ప్రముఖులు ఎందరో వారి వద్ద విద్యనభ్యసించారు. ఇప్పటికీ ఆయా ప్రముఖులు కొందరు ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ "చదువుకోకపోతే పెంకులు నేసుకోడానికి కూడా పనికి రారురా" అని తిట్టి కొట్టి వాత్స్యాలంతో చదువు చెప్పేవారు మీ ముత్తాతగారు అందుకే ఇంతవాళ్లమయ్యాము అని చెప్పుకుంటారు. అది ఎంత ఎదిగినా ఒదిగే వారి సంస్కారానికి నిదర్శనం.

వర్తమానం:-

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి  ఉన్నాయి. సమీప మాధ్యమిక పాఠశాల పెనికేరులో ఉంది. సమీప జూనియర్ కళాశాల ఆలమూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మండపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కాకినాడలోను, పాలీటెక్నిక్‌ రావులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మండపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పినపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పినపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పినపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 36 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
 • బంజరు భూమి: 15 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 253 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 6 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 262 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పినపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 262 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పినపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,227 - పురుషుల సంఖ్య 1,637 - స్త్రీల సంఖ్య 1,590 - గృహాల సంఖ్య 908
PINAPALLA GOLLALAMMA పినపళ్ళ గ్రామ దేవత గొల్లాలమ్మవారు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,944.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,507, మహిళల సంఖ్య 1,437, గ్రామంలో నివాస గృహాలు 743 ఉన్నాయి.

గ్రామ విశేషాలు:[మార్చు]

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ

ఆయువుగల్గు ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి

జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన

స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియు చుందుము

ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము

ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై .....జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాప స్ఫూర్తిగా,

ఏ దేశ మేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి  భారతిని అన్న రాయప్రోలు సుబ్బారావు గారు మాటలను మననం చేసుకుంటూ మా పుణ్య పూర్వికుల ఊరు పినపళ్ళ గ్రామ విశేషాలు భావితరాలకు నిక్షిప్తం చెయ్యాలన్న సత్సంకల్పం! మిత్రులారా మీకు తెలిసిన సమాచారాన్ని ఇందులో పొందుపరచి మన గ్రామ సమగ్ర విశేషాలు పూర్వ చరిత్ర భావితరాలకు అందిద్దాం! సత్యసాయి - విస్సా ఫౌండేషన్!

పినపళ్ళ గొల్లాలమ్మవారు PINAPALLA GOLLALAMMAVARU గ్రామ దేవత :[మార్చు]

పినపళ్ళ గొల్లాలమ్మవారు గ్రామ దేవతల గురించి పూర్తి వివరాల కోసం ఈ వికీ పీడియా గ్రామ దేవత లింక్ నొక్కి చదవండి. 

తూర్పు గోదావరి జిల్లా లోని ఆలమూరు మండలంలోని ఈ గ్రామంలో పినపళ్ళ గ్రామదేవతగా కొలువున్నగొల్లాలమ్మ వారు ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లని దీవేనలందించే చల్లని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్థం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వకం మైన ఆచారం. మా పినపళ్ళ దేవత గోల్లాలమ్మ ఏటా జాతర మహోత్సవాలు జరుగుతాయి.

మన దేశంలో గ్రామదేవతల ఆరాధన అన్నది అనాదిగా వస్తూన్న ఆచారం, ఊరు పొలిమేరలో ఉండి దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని గ్రామప్రజలను కాపాడతారు. అందుకు గ్రామప్రజలు కృతజ్ఞతగా ఏటేటా వారికి కొలుపులు, పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. మరి అటువంటి గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు ఇలా అనేక విషయాలు ఆసక్తి కరంగా వుంటాయి. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం! ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైనది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఆరాధన ఇప్పటి ఆటవిక జాతుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. ఇలాగే ప్రకృతి ఆరాధన విషయంలో ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మనవారు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నదీనదాలు, కుక్క, పాము వంటి చరాచర జీవులన్నింటినీ పూజిస్తున్నారు.

మన దేశంలో అతి పెద్ద మతంగా ఉన్న హిందూ మతం నిజానికి మతమే కాదు. అది ప్రకృతిలోని ఒక ప్రాంతం పేరు (సింధ్ అనే ప్రాంతం) కాల క్రమంగా హింద్ గా మారటం వల్ల ప్రచారంలోకి వచ్చిన పేరు. హిందూ మతంగా చెప్పుకుంటున్న జీవన విధానంలో ఉన్నదంతా ప్రకృతి శక్తుల ఆరాధనే. ప్రకృతే సృష్టికి మూలంగా భావించి ఒక శక్తిగా కొలవడం మొదట ప్రారంభం అయింది. భూమిపై పెరిగే మొక్కలే మిగిలిన జీవరాసులందరికీ జీవనాధారం కాబట్టి భూమిని భూమాత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టమని అర్థమయిన తరువాత సూర్యభగవానుడన్నారు. బతకడానికి గాలి, నీరు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాయు దేవుడు, వరుణ దేవుడు (వర్షాన్నిచ్చే దేవుడు) అన్నారు. సకల నదులు, ఏరులు గంగాదేవిగా పూజలందుకోవడం ప్రారంభమయింది. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే ప్రపంచంలో ఎందరో అమ్మదేవతలు ఉన్నారు. వారిలో మన దేశానికి వచ్చేటప్పటికి అదితి, లజ్జాగౌరి, రేణుక అనేవారు ముఖ్యులు.

చిన్నతనం నుంచి చుట్టుపక్కల గ్రామాలయిన చింతలూరు నూకాలమ్మవారి, పెదపళ్ల, సంధిపూడి గ్రామాల్లో కొలువైన అమ్మవారి జాతరలు తీర్థాలు మరియు మా స్వగ్రామం పినపళ్ళలో కొలువున్నగొల్లాలమ్మ వారి జాతర సంబరాలలో భాగంగా చిన్న జాగారం, పెద్దజాగరం, తీర్థం, ఇలా నెల రోజులనుండి    ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లిని దీవేనలందించే చల్లని చక్కని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్ధం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వక మైన ఆచారం. అలా ఆవిడని మా ఇంటికి ఆహ్వానించి తగు రీతిని సేవించి తరించడం మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. ఆ సంప్రదాయాన్ని ఈ తరంలో మేము సైతం ఆచరించి తరిస్తున్నాం! ఈ నెల  తేదీలలో ఆ సంబరాలు జరుగుతాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ...ఆ మహోత్సవ దృశ్యాలు  మీ అందరికోసం! వీక్షించండి!! తరించండి!! ఈ దిగువ యు ట్యూబ్ లింక్లు నొక్కి చూడవచ్చు.  ఆ చల్లని గొల్లాలమ్మ తల్లి దీవెనలు మన అందరిపై ప్రసరించు గాక!!  ----సత్యసాయి విస్సా ఫౌండేషన్  

1) https://www.youtube.com/watch?v=W5evYT7OfSc

2) https://www.youtube.com/watch?v=6ffoly9GClU

3) https://www.youtube.com/watch?v=REDAYyZA2sw

4) శ్రీ గొల్లాలమ్మవారి జాతరమహోత్సవంలో ఆసాదులవారిచే అమ్మవారి దండక పఠనం 04-06-2016; https://www.youtube.com/watch?v=sTX6QZ5IJvc

5) శ్రీ గొల్లాలమ్మవారి జాతరమహోత్సవంలో అమ్మవారి గరగనృత్యం 04-06-2016; https://www.youtube.com/watch?v=DjxcYCBLNZ8

6) శ్రీ గొల్లాలమ్మవారి జాతరమహోత్సవంలో అమ్మవారి ఊయల సంబరం 04-06-2016; https://www.youtube.com/watch?v=_ex67LXew2c

7) శ్రీ గొల్లాలమ్మవారి జాతరమహోత్సవంలో శ్రీ గొల్లాలమ్మవారికి విస్సావారి కుటుంబం కాగడాల సమర్పణ 04-06-2016; https://www.youtube.com/watch?v=PP_Um2HXh4A

విస్సా వారి వంశ చరిత్ర:[మార్చు]

  విస్సా వారి కుటుంబ వివరాలు: 1890 వీరి పూర్వులు పశ్చిమగోదావరిజిల్లా వేల్పూరుగ్రామం నుండి వలసవచ్చారుట. భీమరాజు - నీలయ్యలు అనే అన్నదమ్ములు దారిలో గంగాలమ్మ విగ్రహం కనిపిస్తే పినపళ్ళ గొల్లాలమ్మ అమ్మవారి గుడివెనుక చింతచెట్టు మొదట్లో పెట్టారుట. దానికి గంగాలమ్మ చింత చెట్టు అనిపేరు. గాలివానకి 300 ఏళ్ళ చెట్టు 1969 లో కూలింది. వానలు కురవకపోతే ముత్తయిదువులు బిందెలతో గంగాలమ్మకి నీళ్ళుపోస్తే.. ఆనాడే వాన కురియుట ఆనవాయితీగా ఉంది. ----సత్యసాయి విస్సా ఫౌండేషన్.

విస్సా వారి కుటుంబం గురించి పినపళ్ళ గ్రామ ప్రముఖులు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళాప్రియుడు, పర్యాటకుడు, "యాత్ర ప్రియారత్న" శ్రీ కొత్తపల్లి సూర్యానారాయణ గారి స్పందన: ముఖపుస్తక మాధ్యమం  20-03-2019    Suryanarayana Kothapalli ప.గో.జి.లో మిలటరీ మాధవరం అనేవూళ్ఱో ఇంటికిఒక్క రన్నా మిలటరీ లోచేరినవారుంటారట తూ.గో.జీ.లో ఆలమూరు మండలం లోని పినపళ్ళ గ్రామం లోఉదేమిలటరీ కి చెందిన ఆర్డినెన్స్ ఫేక్టరీల్లో ఒకే కుటుంబా నికిచెందిన ముగ్గురు ఉెద్యోగం చేస్తూ తమసేవలందించారు వారిలో ప్రస్తుతం ఫేస్ బుక్ లోతరచు విలువైన వివేకవంతమైన పోస్టులు పెడుతూఅందరినీ అలరిస్తున్న శ్రీ.సత్యసాయివిస్సా ఒకరు విదుషీమణి ...శ్రీమతి.విస్సా నాగమణి గారు వీరి సతీమణియే. వీరు కూడ తమ భావ ఝరిని నిరంతరం ఫేస్బుక్ లో వితరణ చేస్తూండటం వీక్ష కులుఎరిగినదే...

విషయంలోకి వస్తాను...సత్యసాయి గారి చిన్నాన్నగారైన...విస్సా రాధాకృష్ణ గారు జబల్ పూరు ఆయుధ కర్మాగారం లో ఉన్నతో ద్యోగం చేసి రిటైరై కూడ మిలటరీ పటిమ తో అడ్వకేట్ గాప్రాక్టీస్ చేస్తున్నారు. మరో చిన్నాన్నగారైన విస్సా సీతారామ్ గారు కూడ జబల్పూరు ఆయుధకర్మాగారాల్లో ఉద్యోగంచేశారు. విస్సా వారికుటుంబం లో ఉపాధ్యాయవృత్తిలో మూడు తరాల వారున్నారు.పాతతరం లో శ్రీ.ప్రసాదరావుగారు వీధిన వెళుతూ వుంటే సామాన్యులు మాన్యులు పూజ్యభావం తో అంజలి ఘటించే వారట.వారి కుమారుడు శ్రీ.వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయ వృత్తి కి వన్నెతెచ్చారు. వీరికి సంగీతంఅదనపు అలంకారం.వీరి కుమారుడు శ్రీ.ప్రసాదరావుగారు ఉపాధ్యాయ వృత్తి తోబాటుహోమియో వైద్యం సప్త తాళ తరంగాల భజన బుర్రకధ లుచెప్పడం లోవిశేషమైన పేరు గడించారు. వీరితనయుడుశ్రీ.వెంకట్ వృత్తుల్లో కెల్లఆకర్ష నీయమైన మేటి ఉపాధ్యాయ వృత్తిలో నేసౌఖ్యంగాసగౌరవంగా సేవలందిస్తు న్నారు.

అంతేకాదు...విస్సా వారివంశంలో సంగతసాహిత్యాలతో బాటు కవిత్వం కూడ అనువంశికంగా వస్తూనే వుంది.పెద్దాయన ...సత్యసాయి గారి పెదతాత గారైన వేంకటరావుగారు సహజకవి సరళ కవి శ్రీవెంకటేశ్వర శతకం వ్రాశారు. ద్రాక్ష పాకం కంటె సుళువైన కలఖండ పాకం శైలి లో.వీరిప్రత్యేకతలు....అజాతశతృవు ..మృదు మధుర భాషి...డబ్బంటేఎవరికిచేదు..జనాంతిక ప్రశ్న....ఈ మహాత్మునికి చేదే....బీరువాల్లోని జేబుల్లోని రొంటిన వున్న డబ్బునిఘడియకోసారి తడిమి చూసు కుంటూ దాచుకునో ఖర్చుపెడుతూనో ఝంఝాటంలో సతమత మయ్యేరోజుల్లోఈయన....exemtion....| ఇదే వంశం లో ఇదిగో...ఈ మన సత్యసాయి గారుమరో కవి..| దేవులపల్లి లా భావకవి ..చిన్నయసూరిలా వచనకవి

అన్నట్లు....నన్నయ్య ఇంట్లో మరో కవిలేడు...ఎఱ్ఱన...తిక్కన...పోతన...మొదలైనపూర్వ కవులు....శ్రీ.శ్రీ. ఆరుద్ర ఆత్రేయ మొలైనఆధునిక కవులు కూడ ఈ వరస లోని వారే.....| ..సాయిగార్కి మహా సహస్రావధాని ఫుంబావ సరస్వతి నడయాడే విగ్జ్నానసర్వ స్వం అసూయా గ్రస్తులు నివురు గప్పిన నిప్పు మద్బులు చాటు వచ్చిన మధ్యందిన మార్తాండుడు ఐన మాడుగులనాగఫణి శర్మగారుసన్నిహితులు వారు.ఇృగువ కట్టిన వస్త్రంకు మల్లెలుమోసుక వచ్చిన లేలేత అరిటాకు కుఆయావాసనలు అంటకుండాఉండవు గదా ,...|ఆ మహా పండితుని సాహచర్యం వృధా కాలేదు ఈయన గ్రహణ శక్తి మేరకు అబ్బింది. షరతులు వర్తిస్తాయన్నట్లు సృగీతం గానం అదనపు యోగ్యతలు....|   

ప్రముఖులు:[మార్చు]

బచ్చు వీర్రాజు గారు వేసిన రావిచెట్టు, మెండు వారు శ్రీ రామాలయం కట్టించారు. మెండు వీర్రాజు గారు మరియు వీరి సంతతి చాలా పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డారు. శ్రీ సంగీత గంగరాజు గారు కూడా ఉపాధ్యాయులు వారి వంశం నుంచి ధనరాజు గారు చిన్నకాపు (సంగీత వెంకట రెడ్డి) గారు సర్పంచ్ నుంచి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు పలుమార్లు కాబినెట్ మంత్రిగా పదవులు నిర్వహించారు. ఇంకా అన్నందేవుల, కొత్తూరి, కొత్తపల్లి, వక్కపట్ల, అన్యం, ఏపూరి, ఉండమట్ల, సాధనాల, పోలాబత్తుల, నామాల మొదలగు ఇంటి పేరువారు కాపులలో ప్రముఖులు ఇంకా పసుమర్తి, చామర్తి వారు వారు మొదలగు వైశ్య ప్రముఖులు,  కనపర్తి, గంగలకుర్తి, పాలాడి, దూదేకుల, ఎరుకల, యనమదల, గుత్తుల, బూసి, బుంగ వారు ఇతర కుటుంబాల వారు. బూసి శుభామణి గారు కస్టమ్స్ కలక్టర్ గా పనిచేశారు.

ధనుర్మాస శుభవేళ ఉత్సవ మూర్తుల ఊరేగింపు![మార్చు]

మా పినపళ్ల గ్రామంలో వేంచేసి వున్న శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామి వారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు, శ్రీ హనుమత్ లక్ష్మణా సమేత శ్రీ  సీతారామచంద్రమూర్తి స్వామి వారు ఉత్సవ మూర్తులై ధనుర్మాస శుభవేళ మా ఊరుని పావనం చేస్తారు. అలా మా విస్సా నిలయంలో మా కుటుంబం తరతరాల సేవిస్తున్నది. ఆ ఉత్సవ సంబరాల దృశ్యమాలికలు ఈ యూట్యూబ్ లింకులు నొక్కి చూడండి. 

ధనుర్మాస వేళలో మా పల్లె పినపళ్ళలో నగర సంకీర్తన![మార్చు]

 • https://youtu.be/ivIemQ613bo
 • ఈ లింక్ నొక్కి చూడండి. 8 సంవత్సరాల నుంచి 40 మంది సంభ్యుల బృందం పట్టాభిరామయ్య, చంద్రమ్మ, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి , చామకూరి శివకుమారి, వరలక్ష్మి, చంద్రావతి, నాగమణి, శేషారత్నం, ఏపూరి దుర్గ , తదితరులు ఈ ధనుర్మాస వేళలో ఉదయం 3 గంటలకే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి, హరి సంకీర్తనలు చేసూ నగర సంకీర్తన చేస్తూ, కోలాటం నేర్చుకుని, పాటలు పాడుతూ, శ్రీవారి సేవకు తరచూ వెళుతూ మన ఘన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతినిధులుగా ముందు తరాలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. వారినందరినీ మా విస్సా ఫౌండేషన్ అభినందిస్తున్నది. సత్యసాయి విస్సా ఫౌండేషన్!

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-08. Cite web requires |website= (help)
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-08. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=పినపల్లి&oldid=2807104" నుండి వెలికితీశారు