Jump to content

పి.వి.ఎన్.మాధవ్

వికీపీడియా నుండి
పోకల వంశీ నాగేంద్ర మాధవ్
పి.వి.ఎన్.మాధవ్


పదవీ కాలం
2025 జులై 1 – ప్రస్తుతం
ముందు దగ్గుబాటి పురంధేశ్వరి

పదవీ కాలం
2017 మార్చి 30 – 2023 మార్చి 29
తరువాత వేపాడ చిరంజీవిరావు
నియోజకవర్గం ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-10) 1973 August 10 (age 52)
మద్దిలపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పీ.వీ. చలపతిరావు[1], రాధా
జీవిత భాగస్వామి మాధురి
నివాసం విశాఖపట్నం

పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశాడు.

ఆయన 2025 జూన్ 30న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పీవీ మాధవ్‌ 1973 ఆగస్టు 10న అనకాపల్లిలో పీ.వీ. చలపతిరావు, రాధా దంపతులకు జన్మించాడు. ఆయన విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ సంఘ్‌ పాఠశాలలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు, విశాఖపట్నం వీఎస్‌ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం, ఏఐసీడబ్ల్యుఏలో సీఏ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లమో పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మాధవ్ తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వీ. చలపతిరావు అడుగుజాడల్లో విద్యార్థి దశలో ఏబీవీపీలో చేరి పలు కార్యక్రమాల్లో పాల్గొని 2003లో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం)లో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2003 నుండి 2007 వరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుని, 2007 నుండి 2010 వరకు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010 నుండి 2013 వరకు బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2009లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మాధవ్ 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశాడు.[5] ఆయన 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2 January 2023). "పీవీ చలపతిరావు కన్నుమూత". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  2. "భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్‌". Eenadu. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
  3. "ఏపీ బీజేపీ కొత్త బాస్‌గా PVN మాధవ్‌". Sakshi. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
  4. "క్రమశిక్షణ, విధేయతకు పట్టం." Eenadu. 2 July 2025. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  5. Sakshi (22 March 2017). "టీడీపీకి ఎదురుదెబ్బ". Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
  6. Andhra Jyothy (18 March 2023). "డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఏంటంటే." Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.