Jump to content

పీ.వీ. చలపతిరావు

వికీపీడియా నుండి
పీ.వీ. చలపతిరావు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
1980 – 1986
నియోజకవర్గం విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం

ఎమ్మెల్సీ
పదవీ కాలం
1974 – 1980
నియోజకవర్గం విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-10) 1973 ఆగస్టు 10 (వయసు 51)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రాధా
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పి.వి.ఎన్.మాధవ్
నివాసం విశాఖపట్నం

పీ.వీ. చలపతిరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పీ.వీ. చలపతిరావు 1935 జూన్ 26న విశాఖలోని ఇసుకతోట పిఠాపురం కాలనీలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆయన భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పి.వి.ఎన్.మాధవ్ ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

పీ.వీ. చలపతిరావు పదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరాడు. ఆయన 1956 నుంచి 1966 వరకు పారిశ్రామిక విస్తరణ అధికారిగా పనిచేసి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. చలపతిరావు 1967 నుంచి విశాఖ ఉక్కు ఉద్యమంలో, 1973లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించాడు. పీ.వీ. చలపతిరావు ఎమర్జెన్సీ కాలంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన 19 నెలలు అజ్ఞాతంలో గడిపాడు. ఆయన1980 నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తొలిసారి విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం నుండి 1974లో తొలిసారి, 1980లో రెండోసారి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

పీ.వీ. చలపతిరావు అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఆరిలోవ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2023 జనవరి 1న మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (1 January 2023). "బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతి రావు కన్నుమూత". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  2. A. B. P. Desam (1 January 2023). "బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు కన్నుమూత". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  3. Sakshi (2 January 2023). "పీవీ చలపతిరావు కన్నుమూత". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.