పి. కరుణాకరన్
పి. కరుణాకరన్ | |||
| |||
పదవీ కాలం 2 జూన్ 2004 – 17 జూన్ 2019 | |||
ముందు | టి. గోవిందన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కాసరగోడ్ | ||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ నాయకుడు
| |||
పదవీ కాలం 2014 - 2019 | |||
ముందు | బాసుదేవ్ ఆచార్య | ||
తరువాత | పి.ఆర్. నటరాజన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కాసరగోడ్ , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కేరళలో , భారతదేశం ) | 1945 ఏప్రిల్ 20||
రాజకీయ పార్టీ | సీపీఐ(ఎం) | ||
తల్లిదండ్రులు | ఎన్. కొరాన్, పి. చిరుత | ||
జీవిత భాగస్వామి | లైలా (m. 1978) | ||
బంధువులు | ఎకె గోపాలన్ (మామ) సుశీల గోపాలన్ (అత్తగారు) | ||
సంతానం | 1 కుమార్తె | ||
నివాసం | త్రివేండ్రం , కేరళ , భారతదేశం | ||
మూలం | [1][2] |
పి. కరుణాకరన్ (జననం 20 ఏప్రిల్ 1945) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన రెండుసార్లు త్రిక్కర్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]పి. కరుణాకరన్ సీపీఐ(ఎం) ద్వారా రాజకియలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి త్రికరిపూర్ శాసనసభ నియోజకవర్గం 1977 నుండి 1982 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఎ. మహమ్మద్ పై 1,08,256 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 2004 నుండి 2006 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 2005 నుండి 2009 వరకు అంచనాల కమిటీ సభ్యుడిగా, 2006 నుండి 2009 వరకు రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
కరుణాకరన్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి షాహిదా కమల్ పై 64,427 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 2004 నుండి 2006 వరకు అంచనాల కమిటీ సభ్యుడిగా, రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు.
కరుణాకరన్ 2014లో కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి టి. సిద్ధిక్ పై 6,921 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో ప్రత్యేక ఆహ్వాని, వ్యాపార సలహా కమిటీ సభ్యుడిగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సభా సమావేశాలకు సభ్యుల గైర్హాజరీపై కమిటీ ఛైర్మన్‌గా, రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
రచించిన పుస్తకాలు
[మార్చు]- మెమోరీస్ ఆఫ్ వియత్నాం
- ఇండియన్ పాలిటిక్స్ - ఇన్‌సైడ్ అండ్ అవుట్ సైడ్ పార్లమెంట్
- సప్రెషన్ అండ్ రెసిస్టెన్స్
- ఇండియన్ పాలిటిక్స్ - ఇన్‌సైడ్ అండ్ అవుట్ సైడ్ పార్లమెంట్ (రెండవ భాగం)
- ఒలిమంగరూర్మకల్
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (4 June 2024). "P KARUNAKARAN : Bio, Political life". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
- ↑ ThePrint (21 March 2019). "MY543 Kerala-Kasaragod". Retrieved 30 July 2024.