పాణ్యం ఉప్పు వనజా బాయి

వికీపీడియా నుండి
(పి. వి. వనజా బాయి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పాణ్యం ఉప్పు వనజా బాయి
జననంనవంబర్ 27, 1930
మరణంఆగష్టు 10, 2007
వృత్తిసంఘసేవ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహిళా సమాజ్, మహిళా సంక్షేమ సహకార సంఘం
జీవిత భాగస్వామిపి.వి.రంగనాథ రావు
తల్లిదండ్రులు
  • పళ్లై వెంకట సుబ్బారావు (తండ్రి)
  • సావిత్రి బాయి (తల్లి)

పాణ్యం ఉప్పు వనజా బాయి (27 నవంబర్ 1930 - 10 ఆగష్టు 2007) (English: P. V. Vanaja Bai) (పి. వి. వనజా బాయి లేదా వనజమ్మగా ప్రసిద్ధి చెందింది), ఒక భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క క్రియాశీల రాజకీయ నాయకురాలు. ఆమె 1962లో భారతదేశంలో మహిళా సమాజ్, వెల్ఫేర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆఫ్ ఉమెన్‌ని స్థాపించారు. ఆమె మహిళా సమాజ్ డైరెక్టర్‌గా, వెల్ఫేర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆఫ్ ఉమెన్ అధ్యక్షురాలిగా పనిచేశారు.[1] వీటితో పాటు రైల్వే కమిటీ బోర్డు సభ్యురాలిగా, శారద మహిళా మండల అధ్యక్షురాలుగా, కర్నూలు జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కమిటీ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా పాణ్యం శాసనసభ నియోజకవర్గంతో సహా బనగానపల్లె శాసనసభ నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో ఆమె కీలక పాత్ర పోషించారు.[2] మహిళలు, పేదలు, అట్టడుగు వర్గాల వారికి విద్యను అందించడంలో, గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ఆమె చేసిన కృషికి ఆమె ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది. మైసూర్, పూణే, చెన్నై, కర్నూలు వంటి నగరాల్లో కూడా ఆమె ఈ సమస్యలపై అనేక ప్రసంగాలు చేశారు.[3][4][5][6]

తొలి జీవితం[మార్చు]

పి. వి. వనజా బాయి గారు తమిళనాడులోని చెన్నైలో 1930 నవంబర్ 27న ప్రముఖ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పళ్లై వెంకట సుబ్బారావు, సావిత్రి బాయి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్, బ్రిటిష్ రాజ్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో అనేక జిల్లాలకు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు. సివిల్ సర్వెంట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత చల్లగల్ల నరసింహం గారు తన ఆత్మకథలో, పి.వి.సుబ్బారావు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, రాష్ట్ర పరిపాలనలో సహాయం చేశారని చెప్పారు.[7] వనజా బాయి పాణ్యానికి చెందిన ప్రముఖ ఉద్యానవనవేత్త, భూస్వామి పాణ్యం ఉప్పు రంగనాథరావును 1952లో వివాహం చేసుకున్నారు.[8][9]

మహిళా సమాజం[మార్చు]

1962 ఏప్రిల్ 16న, వనజా బాయి మహిళా సమాజ్ (మహిళా అభివృద్ధి సంఘం) అనే సంస్థను స్థాపించారు. ఆమె దాని మొదటి అధ్యక్షురాలు, కోశాధికారి.[10]

మరణం[మార్చు]

వనజా బాయి గారు 2007 ఆగస్టులో గుండెపోటుతో నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.

వనరులు, మూలాలు[మార్చు]

  1. Jagannathan 1977, p. 22.
  2. Business India, Issues 469-473. A. H. Advani. 1996.
  3. Ajīta Kaura,Arpana Cour (1976). Directory of Indian Women Today, 1976. India International Publications. p. 434.
  4. Social Welfare,Volumes 23-24. Central Social Welfare Board. 1978. p. 28. On 16th April 1962, the Mahila Samaj was formed. Nobody could imagine then that it would grow into such as big organisation. One of the leaders is Smt. Vanaja Bai who is also founder of this Samaj. All credit must go to her for maintaining this Samaj in a better way.
  5. Census of India, 1971: Mysore, Part 2, Volume 2. India. Office of the Registrar General Manager of Publications. 1973.
  6. Jagannathan 1977, pp. 21–23.
  7. C. Narasimham (1986). Me and My Times. Radna Corporation. p. 259.
  8. Maithly Jagannathan (1977). Home Science (in ఇంగ్లీష్). Farm Information Unit, Directorate of Extension, Ministry of Agriculture & Irrigation. p. 21. This lady Smt . Vanaja Bai, originally from Karnataka had married a Landlord and Horticultural Nursery farmer Sri. Ranganatha Rao. She is an educated lady ( a graduate from Madras has not only settled in this village but is also ...{{cite book}}: CS1 maint: date and year (link)
  9. Jagannathan 1977, pp. 20–23.
  10. Social Welfare,Volumes 23-24. Central Social Welfare Board. 1978. p. 28.

గ్రంథ పట్టిక[మార్చు]

  • Jagannathan, Maithly (1977). Home Science (in ఇంగ్లీష్). Farm Information Unit, Directorate of Extension, Ministry of Agriculture & Irrigation.{{cite book}}: CS1 maint: date and year (link)