పి. శ్రీజ
పి. శ్రీజ | |
---|---|
జననం | పొడిశెట్టి శ్రీజ |
వృత్తి | డాక్టర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ |
తల్లిదండ్రులు | శ్రీనివాస్ , లత |
బంధువులు | సాయిరాజ్ (తమ్ముడు) |
పొడిశెట్టి శ్రీజ 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె సివిల్స్ 2020 ఫలితాల్లో ఆల్ ఇండియా 20వ ర్యాంకు సాధించింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]పి. శ్రీజ తెలంగాణ రాష్ట్రం , జనగామ జిల్లా , రఘునాథపల్లి లో శ్రీనివాస్ , లత దంపతులకు జన్మించింది. పిల్లల చదువులకోసం వారి తల్లితండ్రులు శ్రీజ చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఆమె తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని హోండా షోరూమ్‌లో సీనియర్ సేల్స్ మేనేజర్‌గా, తల్లి లత రఘునాథపల్లి పీహెచ్‌సీలో నర్సుగా పని చేస్తుంది.[2] శ్రీజ రెండవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చైతన్యపురిలోని రఘునాథ హైస్కూల్‌లో, ఇంటర్ శ్రీ చైతన్య కళాశాలలో పూర్తి చేసి ఉస్మానియా వైద్య కళాశాలలో (2019) మెడిసిన్ పూర్తి చేసింది.[3]
సివిల్స్
[మార్చు]డాక్టర్ పి. శ్రీజ తన తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యింది.[4] ఆమె హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని విజన్ ఐఏఎస్ అకాడమిలో కోచింగ్ తీసుకుంది.[5] శ్రీజ సివిల్స్‌లో ‘మెడికల్ సైన్సెస్’ సబ్జెక్టు ఆప్షన్‌గా ఎంచుకుంది. ఆమె పదేళ్ళ (ప్రీవియస్) ప్రశ్నపత్రాలు తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యింది. శ్రీజ సివిల్స్ 2020 ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించింది.[6]
పి.శ్రీజ 2023 డిసెంబర్ 15న ములుగు అడిషనల్ కలెక్టర్‌గా నియమితురాలైంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (25 September 2021). "UPSC civil examination: P Srija tops from Telangana, secures 20th rank in India" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ Namasthe Telangana (25 September 2021). "అమ్మ.. నా గైడ్, మెంటర్!". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
- ↑ Sakshi (26 September 2021). "ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ Andrajyothy (26 September 2021). "నాన్న మాట నడిపించింది". Archived from the original on 30 September 2021. Retrieved 3 October 2021.
- ↑ Namasthe Telangana (26 September 2021). "ఇష్టపడి చదివితే సివిల్స్‌లో మంచి ర్యాంక్". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ Andrajyothy (25 September 2021). "సివిల్స్‌లో వరంగల్ అమ్మాయికి 20వ ర్యాంకు". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ Namaste Telangana (15 December 2023). "తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా గౌతమి". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.