పుణ్యభూమి కళ్ళు తెరిచింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుణ్యభూమి కళ్ళు తెరిచింది
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దేవదాస్ కనకాల
తారాగణం శ్రీధర్,
సంగీత,
రాళ్లపల్లి
సంగీతం బి.గోపాలరావు
నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పుణ్యభూమి కళ్ళు తెరిచింది 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీధర్, సంగీత, రాళ్లపల్లి నటించగా, బి.గోపాలరావు సంగీతం అందించాడు.[1] భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను బిక్కిన సత్యనారాయణమూఋతి, బడుగు విష్ణుమూర్తి లు నిర్మించారు.[2]

కథ[మార్చు]

మనదేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వం జమీందార్ల కబంధ హస్తాలలో గ్రామవసీలు ఎలా తల్లిడిల్లారో చూపడానికి గతంలో అనెక ప్రయత్నాలు జరిగాయి> ఈ చిత్రం ఆ కోవకు చెందినది.

రెండవ ప్రపంచయుద్ధం ముమ్మరంగా జరుగుతున్న రోజులలో క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడే ఉధృత రూపాన్ని ధరిస్తోంది. గాంధీజీ నాయకత్వంలో అహింసా పోరాటం అంత్య దశకు చేరుకుంటున్నది. ఆ ఊరు జమీందారు క్రూరత్వానికి, కుతంత్రాలకు మారుపేరు. పేద రైతుల పొట్ట గొట్టడంలో స్త్రీల మానాలను హరించడాంలో అతనికి అతడే సాటి. అతనికి నమ్మిన బంటుల్లో పాలేరు నాగరాజు ఒకడు. అతని తమ్ముడు సాంబయ్య జమీందారు కూరుతుతో పాటు పట్నం కాలేజీలో చదువుతుంటాడు.

ఆ పూరు మాస్టారు పక్కా గాంధేయవాది. సాంబయ్య, జమీంద్రారు కూతురు కాంగ్రెస్ ఉద్యమ ప్రభావానికి లోనవుతారు. నమ్ముకున్న పాలేరు భార్యను జమీందారు కాటేస్తే అందుకు ఎదురు తిరిగిన పాలెరుకు ప్రాణమే శాపమవుతుంది. జమీందారు కూతురు తండ్రి ఆగడాలను ఎదిరిస్తే, సాంబయ్య విప్లవ కేతనం ఎగరేసి గ్రామంలోని దుష్టుల ఆగడాలకు అడ్డుకట్టా వేస్తాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకోవడంతో, పాలేరు నాగరాజు పెళ్ళాం జమీందారు మీద తన కసి తీర్చుకోవడంతో చిత్రం ముగుస్తుంది.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: దేవదాస్ కనకాల
  • సంగీతం: బి.గోపాలరావు
  • నిర్మాణ సంస్థ: భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: బిక్కిన సత్యనారాయణమూర్తి, బడుగు విష్ణుమూర్తి
  • విడుదల తేదీ: 1982 జూలై 31

మూలాలు[మార్చు]

  1. తెలుగు సినీ బ్లిట్జ్, The Complete Database of Telugu Cinema SEARCH. "Punyabhoomi Kallu Terichindi". http://telugucineblitz.blogspot.in. Archived from the original on 31 డిసెంబర్ 2017. Retrieved 27 June 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |website= (help)
  2. "Punyabhumi Kallu Therichindi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  3. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-18.