పురాణం కనకయ్య శాస్త్రి
స్వరూపం
పురాణం కనకయ్య శాస్త్రి (1899 - 1954) ప్రముఖ గాయకులు.
వీరు కృష్ణా జిల్లాలోని పరిటాల గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పురుషోత్తమ శాస్త్రి, మంగమ్మ. వీరు తండ్రి దగ్గర కొంత సంగీతాన్ని అభ్యసించి, తర్వాత పాపట్ల లక్ష్మీకాంతయ్య వద్ద విశేష జ్ఞానాన్ని సంపాదించారు. దేశాటనం చేసి సంగీతంలో జ్ఞానాన్ని, మైసూరు మొదలైన సంస్థానాలలో సన్మానాలను పొందారు. మద్రాసులో తచ్చూరు సింగరాచార్యులు వద్ద ఫిడేలు వాదన నేర్చుకున్నారు. గద్వాల సంస్థానంలో వీరు ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. వీరు ఆనంద భైరవి, ధన్యాసి మొదలైన రాగాలలో అనేక వర్ణాలను రచించారు.
వీరు 1954 సంవత్సరంలో గుంటూరులో పరమపదించారు. వీరు కుమారుడు పురాణం పురుషోత్తమ శాస్త్రి ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.[1]
మూలాలు
[మార్చు]- ↑ "పురాణం పురుషోత్తమ శాస్త్రి గురించిన హిందూలో వ్యాసం". Archived from the original on 2012-11-08. Retrieved 2010-10-05.