Jump to content

వయొలిన్

వికీపీడియా నుండి
(ఫిడేలు నుండి దారిమార్పు చెందింది)
వయొలిన్
వివిధ రకాల వయోలిన్ శబ్దాలు

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు. చాలా వయోలిన్లు బోలు చెక్క శరీరాన్ని కలిగి ఉంటాయి. తంత్రీ వాయిద్య కుటుంబంలో అతి చిన్నది, అతి ఎక్కువ శృతి కలది. వయోలిన్లో పిక్కోలో, కిట్ వయోలిన్‌తో సహా చిన్న వయోలిన్-రకం వాయిద్యాలు ఉన్నాయి, అయితే ఇవి వాస్తవంగా ఉపయోగించబడవు. వయోలిన్ సాధారణంగా నాలుగు తీగలను కలిగి ఉంటుంది. కర్ణాటక సంగీతంలో సాధారణంగా మందర స్థాయి షడ్జమం (స), మందర స్థాయి పంచమం (ప), మధ్యమ స్థాయి షడ్జమం (స), మధ్యమ స్థాయి పంచమం (ప) లకి శృతి చేయబడి ఉంటుంది, అలాగే పాశ్చాత్య సంగీతంలో G3, D4, A4, E5 లకు శ్రుతి చేయబడుతుంది. సాధారణంగా దాని తీగలను కమానుతో గియ్యడం ద్వారా వాయిస్తారు. అయినప్పటికీ వేళ్లతో తీగలను మీటడం (పిజ్జికాటో) లేదా కామాను చివర చెక్కతో తీగలను మీటడం ద్వారా కూడా వాయించవచ్చు.

వయోలిన్ మొట్టమొదట 16 వ శతాబ్దపు ఇటలీలో తయ్యారు చెయ్యబడింది. 18, 19 వ శతాబ్దాలలో ఈ పరికరానికి మరింత శక్తివంతమైన ధ్వని ఇవ్వడానికి మరికొన్ని మార్పులు జరిగాయి. ఐరోపాలో, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వయోలా వంటి ఇతర తీగల వాయిద్యాల అభివృద్ధికి ఇది ఆధారం. భారతదేశంలో వయోలిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వాడుకలోకి వచ్చింది. దీనిని ముత్తుస్వామి దీక్షితార్ సోదరుడైన బాలుస్వామి దీక్షితార్ కర్ణాటక సంగీతంలోకి ప్రవేశ పెట్టారు.[1] అప్పటినుండి వయోలిన్ పక్కవాద్యముగా ప్రాచుర్యం పొందింది.

శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర దేవాలయంలో శివార్చన కార్యక్రమంలో వయొలిన్ వాయిద్యకారుడు

వయోలిన్ వాద్యకారులు, సంగ్రాహకులు 16 నించి 18 శతాబ్దాల మధ్య ఇటలీలోని బ్రెస్కియా, క్రేమోనాలలో స్ట్రాడివారి, గ్వేనేరి, గ్వాడగ్నిని, అమాటి కుటుంబాల చేత తయారు చేయబడిన చారిత్రిక వయోలిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా వియోలీన్లు వివిధ రకాల కలప నుండి తయారవుతాయి. ఆంత్రము, పెర్లాన్ లేదా, కృత్రిమ దారం, లేదా ఉక్కు తీగలతో వయోలిన్లను కట్టుకోవచ్చు. వయోలిన్ తయారుచేసే లేదా మరమ్మతు చేసే వ్యక్తిని లూథియర్ లేదా వయోలిన్ మేకర్ అంటారు. కమాన్లు తయారుచేసే లేదా మరమ్మతు చేసే వ్యక్తిని ఆర్కిటియర్ లేదా బౌ మేకర్ అంటారు.

నిర్మాణం, పని తీరు

[మార్చు]
2021 ఫిబ్రవరి 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ వాగ్గేయ వైభవం కార్యక్రమంలో వాయిలిన్ కళాకారుడు

వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

ఎలా వాయించాలి?

[మార్చు]

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

ఎలక్ట్రిక్ వయొలిన్

[మార్చు]

ప్రముఖ వయొలిన్ కళాకారులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]



మూలాలు

[మార్చు]
  1. "The Great Violin Maestros of the Past". www.carnaticcorner.com.
"https://te.wikipedia.org/w/index.php?title=వయొలిన్&oldid=4353150" నుండి వెలికితీశారు