పురుషోత్తముడు (పద్యకావ్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పురుషోత్తముడు
"పురుషోత్తముడు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: చిటిప్రోలు కృష్ణమూర్తి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పద్యకావ్యం
ప్రచురణ:
విడుదల:
పేజీలు: 310

పురుషోత్తముడు చిటిప్రోలు కృష్ణమూర్తి వ్రాసిన కావ్యము. ఈ పద్య కావ్యానికి 2008 కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఇది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2009 సంవత్సరం పద్యకవితా పురస్కారం లభించింది.[1]

విశేషాలు

[మార్చు]

అట్టడుగున దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న కావ్యం పురుషోత్తముడు. పురుషోత్తముని పాత్ర చిత్రన దేశభక్తి నేపథ్యంలో భారతీయ సంస్కృతికి ప్రతీకగా తీర్చిదిద్దబడింది. దుష్టుడు, దేశద్రోహి, బానిస స్వభావం కలిగిన "ఆంభి’ పాత్ర చిత్రణ చక్కగా ఉంది. అంభి - అతని చెల్లెలు ప్రార్థనాదేవి సంభాషణ నాటకీయంగా రక్తికట్టింది. స్త్రీలు అబలలు కారు, సబలలు అని నొక్కి చెపుతూ ప్రార్థనాదేవి తన అన్న అంభికి లలితాదేవి చండికగా మారడాన్ని గుర్తు చెయ్యడం రమ్యంగా, ఉంది. ప్రతినాయకుడైన అలెగ్జాండర్ శౌర్యాన్నికూడా కవి నిష్పక్షపాతంగా వీరరసాత్మకంగా ప్రశంసించారు. ఈ వీర కావ్యంలోని యుద్ధవర్ణనలు నన్నెచోడ, తిక్కనల యుద్ధ వర్ణనలను జ్ఞప్తికి తెస్తున్నాయి. పురుషోత్తముని సైన్యం అలెగ్జాండర్ సైన్యంతో తలపడడం, పురుషోత్తముని ఏనుగులు చెలరేగి యిరువైపుల దళాలను నాశనం చేయటం, అలెగ్జాండర్ - పురుషోత్తముల ద్వంద్వయుద్ధం మొదలైనవన్నీ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.[2]

అలెగ్జాండర్ దండయాత్రల గురించి తెలిసిందే. ఆయని ఎదిరించిన ధీరోదాత్తుడు పురుషోత్తముడు వారి చారిత్రక గాథను అక్షరీకరించిన కృష్ణమూర్తి తన కావ్యంలో వారిలో ఎవరో ఒకరిని విజేతగా నిలపలేదు. ఎవరూ జయించలేదు, ఎవరూ ఓడిపోలేదు. ఇద్దరూ పరస్పరం స్నేహార్ధ్రతతోనే యుద్ధాన్ని విరమించారు. అంటారు. మరో సీనియర్ రచయిత మొవ్వ వృషాద్రిపతి మాటల్లో చెప్పాలంటే ఈ దేశభక్తి భరిత కావ్య రచనమును, మహా సమర్ధతతో ప్రతి సన్నివేశ రసానుభూతితో, ప్రతిభావ్యుత్పత్తులతో ప్రతి పద్యమును రసోల్బణముగ రచించిరి.

ఆయన ప్రాచీన మహాకవుల పద్యాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఏ విధమైన దోషాలు లేకుండా, స్వచ్ఛంగా, తీర్చిదిద్దారు. అందుకు ప్రతిపద్యమూ నిదర్శనమే.

ధర్మమనునది సూక్షమై తనరుచుంతు
గ్రాహ్యమియ్యది యియ్యది కాదటంచు
నేర్పఱుచుటెంత ప్రతిభా మహిష్టులకును
జాలదుస్తర మొక్కక సమయమాదు.

ఇది చాలా చిన్న పద్యం. ధర్మాన్ని గురించి రాస్తూ.. ఇలా అందరికీ అర్ధమయ్యేలా చెప్పడం కృష్ణమూర్తి శైలీ విన్యాసం. కావ్యంలో పదకొండు వందలకు పైగా పద్యాలున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు వర్శిటీ సాహితీ పురస్కారాలు March 26, 2011[permanent dead link]
  2. "Chittiprolu Krishnamurthy". Archived from the original on 2015-06-14. Retrieved 2016-02-11.

ఇతర లింకులు

[మార్చు]