పులి (2015 సినిమా)
పులి | |
---|---|
దర్శకత్వం | చింబు దేవన్ |
రచన | శర్మ దేవేన్ |
నిర్మాత | సి. శోభ |
తారాగణం | విజయ్ శ్రీదేవి సుదీప్ శృతి హాసన్ హన్సికా మోత్వాని |
ఛాయాగ్రహణం | నటరాజన్ సుబ్రమణ్యం |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్ |
విడుదల తేదీ | 2 అక్టోబర్ 2015 |
సినిమా నిడివి | 154 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పులి 2015లో తెలుగులో విడుదలైన సోషియో ఫాంటసీ సినిమా.[1] యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్ బ్యానర్ పై సి. శోభ నిర్మించిన ఈ సినిమాకు చింబు దేవన్ దర్శకత్వం వహించాడు. విజయ్, శ్రీదేవి, సుదీప్, శృతి హాసన్, హన్సికా మోత్వాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2 అక్టోబర్ 2015న విడుదలైంది.
కథ
[మార్చు]భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి యవ్వనరాణి (శ్రీదేవి), ఆమె దళపతి జలంధరుడు (సుదీప్) ప్రజలను హింసలు పెడుతూ, వారిని బానిసలుగా చూస్తూ, వారి పంట, ధనాన్ని లాక్కుంటూ వుంటాడు. ఆ భేతాళ దేశం కింద వుండే గ్రామాల్లో భైరవ కోన ఒకటి. ఆ కోనకు నాయకుడు నరసింగ నాయకుడు (ప్రభు). నరసింగకు అనుకోకుండా నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు మనోహరుడు (విజయ్) అనే పేరు పెట్టి, పెంచుతాడు. మనోహరుడిని ఆ భేతాళ జాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు . అదే కోనలో వుండే మందార మల్లి (శృతిహాసన్) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అదే సమయంలో భేతాళ జాతి వారు వచ్చి భైరవ కోనలోని ప్రజలను కొట్టి, మందారమల్లిని ఎత్తుకెళ్లిపోతారు. దీంతో మందారమల్లి కోసం మనోహరుడు భేతాళ దేశానికి బయలుదేరుతాడు . అక్కడ మనోహరుడికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి? మనోహరుడికి భేతాళ దేశంలో తెలిసిన విషయాలేంటి ? మందార మల్లిని మనోహరుడు ఎలా కాపాడాడు ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:యస్.వి.ఆర్ మీడియా (ప్రై) లిమిటెడ్
- నిర్మాత:సి. శోభ
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చింబు దేవన్
- సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రమణ్యం
- ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 September 2015). "పిల్లల కోసం 'పులి'". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ Sakshi (4 January 2015). "తమిళ పులిలో 'శ్రీదేవి'". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ Sakshi (16 July 2015). "పులి కోసం పాట". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.