పుల్లారెడ్డి నేతి మిఠాయిలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదులోని అబిడ్స్ నందలి పుల్లారెడ్డి స్వీట్స్ షాపు

పుల్లారెడ్డి నేతి మిఠాయిలు, ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు, కర్నూలు నగరాలలో ఉన్న ఒక మిఠాయి దుకాణాల సమూహం. ఇది వాణిజ్య సంస్థ అయినా గాని, రాష్ట్రంలో పొందిన ప్రాచుర్యం వల్ల విశిష్టమైన స్థానం సంపాదించుకొంది. ఉదాహరణకు సింహాద్రి సినిమాలో ఒక పాటలో "నీ అధరామృతం పుల్లారెడ్డీ, అర కేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ" అని వస్తుంది.

వ్యవస్థాపకుడు[మార్చు]

జి. పుల్లారెడ్డి, కర్నూలు జిల్లా గోకవరం గ్రామానికి చెందినవాడు. 1948లో కర్నూలులో మిఠాయిల దుకాణాన్ని ప్రాంభించాడు. నాణ్యతకు మంచి పేరు వచ్చి, వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత హైదరాబాదు నగరంలో శాఖ ప్రారంభించాడు. పుల్లారెడ్డి అనేక విద్యా, సాంఘిక, స౦క్షెమ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అలా స్థాపించిన సంస్థలలో ఒకటి "జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి", కర్నూలు. హైదరాబాదులో ఈయన భార్యపేరు మీదుగా స్థాపించిన నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల కేవలం మహిళలకోసమే ప్రత్యేకించబడినది.

ఇతను 2007 మే 9న, తన 88వ యేట, మరణించాడు.

మిఠాయి దుకాణాలు[మార్చు]

పుల్లారెడ్డి మిఠాయి దుకాణాలలో కోవా, బూందీ లడ్డు ప్రసిద్ధమైనవి. హైదరాబాదు నగరంలో ఉన్న బ్రాంచీలు - బేగంపేట, చార్మినార్, పంజగుట్ట,అబిడ్స్, కూకట్‌పల్లి. విదేశాలలో ఉన్న ఆంధ్రులకు కూడా బహుమతిగా ఇక్కడినుండి మిఠాయిలు పంపే సదుపాయం ఉంది. [1]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "మారిషస్‌కూ పుల్లారెడ్డి స్వీట్స్". Saksh News. Retrieved March 15, 2014.