Jump to content

పూజా కుమార్

వికీపీడియా నుండి
పూజా కుమార్
2013లో పూజా కుమార్
జననం (1977-02-04) 1977 ఫిబ్రవరి 4 (వయసు 47)
సెయింట్. లూయిస్, మిస్సోరి, యునైటెడ్ స్టేట్స్
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1997 – ప్రస్తుతం

పూజా కుమార్ (జననం 1977 ఫిబ్రవరి 4) తమిళం, హిందీ, ఆంగ్ల భాషా భారతీయ చిత్రాలలో నటించే భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నటి. ఆమె నటిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగించింది. 1995లో మిస్ ఇండియా యు.ఎస్.ఎ(Miss India USA) గెలుచుకుంది.

మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99, బాలీవుడ్ హీరో, ఫ్లేవర్స్, హిడింగ్ దివ్య, పార్క్ షార్క్స్, బాలీవుడ్ బీట్స్, నైట్ ఆఫ్ హెన్నా, ఎనీథింగ్ ఫర్ యు, డ్రాయింగ్ విత్ చాక్, నాట్స్ అర్బనే వంటి అనేక అమెరికన్ సినిమాలు, షోలలో ఆమె నటించింది.

ఇక ఆమె నటించిన భారతీయ చిత్రాలలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ సరసన విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ చిత్రాల్లో నటించింది. వీటిని హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.[1] ఆమె తెలుగులో రాజశేఖర్ నటించిన పిఎస్‌వి గరుడ వేగతో అరంగేట్రం చేసింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

పూజా కుమార్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో జన్మించింది.[2] ఆమె తల్లిదండ్రులు 1970లో భారతదేశం నుండి వలస వెళ్ళారు.[3] ఆమె వాషింగ్టన్ యూనివర్శిటీ(Washington University in St. Louis)లో చదువుకుంది, అక్కడ ఆమె పొలిటికల్ సైన్స్, ఫైనాన్స్‌లో పట్టభద్రులయ్యింది.

ఆమె భారతీయ శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందింది. కుమార్ 1995లో మిస్ ఇండియా యు.ఎస్.ఎగా ఎన్నికైంది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె 1997లో దర్శకుడు కీయార్ తమిళ చిత్రం కాదల్ రోజావేలో నటించడానికి సంతకం చేసింది, అయితే చిత్ర నిర్మాణం ఆలస్యం అవడంతో అది 2000లో విడుదలైంది.[4][5]

2003లో, ఆమె ఫ్లేవర్స్ చిత్రానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (Screen Actors Guild) ఎమర్జింగ్ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది. 2008లో, ఆమె దేశంలోని జీ టీవీలో జాగో ఔర్ జీతో ప్రత్యక్ష క్విజ్ షోను నిర్వహించింది. ఆమె 2008లో ఐ.ఎఫ్.సి(IFC (American TV channel))లో మ్యూజికల్ కామెడీ మినీసిరీస్ బాలీవుడ్ హీరోలో చేసింది. ఆమె మూడు భాగాల సిరీస్‌లో సాటర్డే నైట్ లైవ్ హాస్యనటుడు క్రిస్ కట్టన్ సరసన నటించింది. 2000ల చివరలో, ఆమె హమ్ టీవీలో పాకిస్థానీ డ్రామా సీరియల్ ఇష్క్ జునూన్ దీవాంగిలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత విశ్వరూపం సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె విశాల్ జోషిని వివాహం చేసుకుంది. వీరికి 2020లో ఒక కూతురు పుట్టింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "కమల్‌తో డేటింగ్‌పై నటి రియాక్షన్ |". web.archive.org. 2023-06-03. Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Pooja Kumar Goes From St. Louis to Bollywood". St. Louis. March 20, 2015.
  3. 3.0 3.1 "Miss India USA 1995 Pooja Kumar courts forbidden love in her ott outing". The Telegraph. November 3, 2020.
  4. "1997-98 Kodambakkam babies Page". Archived from the original on March 3, 2016. Retrieved February 16, 2012.
  5. "A-Z (Ii)". Archived from the original on January 28, 2015. Retrieved February 27, 2015.
  6. "Pooja Kumar is now mom to a baby girl". The Times of India. January 2, 2021.