పూనమ్ యాదవ్
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జాతీయ జట్టు | భారత్ |
జననం | 24ఆగష్టు 1991 ఆగ్రా, ఉత్తర్ ప్రదేశ్ |
వృత్తి | క్రికెటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2013-present |
పూనమ్ యాదవ్, భారతీయ మహిళ క్రికెట్ జట్టు సభ్యురాలు, 1991 ఆగస్టు 24న జన్మించింది. ఆమె తన అంతర్జాతీయ ప్రవేశం బంగ్లాదేశ్ తో 2013 ఏప్రిల్ లో జరిగిన టీ20 తో చేసింది . అదే ఏడాది ఏప్రిల్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ఆమె కెరియర్లో తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కాగా 2014 నవంబరు 16న సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది .[1].2013-14లో భారత జట్టులో అడుగుపెట్టినప్పటి నుంచి తను కీలక సభ్యురాలిగా మారింది . ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన తను దేశవాళీ క్రికెట్‌లో వివిధ జట్లకు ప్రాతినిద్యం వహించింది . 2019లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది .[1][2] పూనమ్ యాదవ్ డబ్ల్యూపీఎల్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]యాదవ్ 1991 ఆగస్టు 24న భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మైన్ పురి లో జన్మించింది. తండ్రి రఘవీర్ సింగ్ యాదవ్. ఆయన ఆర్మీ అధికారిగా పని పనిచేసేవాడు. ఆమె తల్లి మున్నా దేవి, గృహిణి. తమ గ్రామం నుంచి సమీపంలో ఉన్న ఆగ్రా పట్టణానికి కుటుంబం మారినప్పటి నుంచే క్రికెట్ పట్ల ఆమె ఆసక్తి చూపించేది.
యాదవ్ ఎత్తు కేవలం 4 అడుగుల 11 అంగుళాలు మాత్రమే. ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో ప్రాక్టీస్ చేసేది. నిజానికి ఆఫ్ స్పిన్నర్లకు కొదవ లేకపోవడంతో ఆమె లెగ్ స్పిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులోనూ పూనమ్ తన తక్కువ ఎత్తును అనుకూలంగా తీసుకొని బ్యాట్స్‌వుమెన్ దగ్గరగా బంతులు వేసి వికెట్లు తీసేది.
మొదట్లో ఆమె కుటుంబ సభ్యులు క్రికెట్ పట్ల పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఆమె పట్టుదల, కృషి కారణంగా చాలా త్వరగానే రాష్ట్ర జట్టులో చోటు సంపాదించింది .
వృత్తిపరమైన విజయాలు
[మార్చు]మొదట ఆమె సెంట్రల్ టీంకు ఎంపికయ్యింది . ఆపై ఉత్తర ప్రదేశ్ జట్టు సభ్యురాలిగా మారింది . ప్రస్తుతం ఆమె దేశవాళీ క్రికెట్లో రైల్వేస్‌కు ప్రాతినిద్యం వహిస్తోంది.[3]
మొదట్లో రైల్వే క్లర్కుగా పనిచేసిన ఆమె ఇప్పుడు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది .
అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్‌ను 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్‌తో ఆడగా అదే ఏడాది ఏప్రిల్ 12న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.[2]
2014 నవంబరులో ఆమె తన తొలి టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడింది .
తనదైన గూగ్లీలతో 2017 వరల్డ్ కప్‌లో అద్భుతాలు చేసింది. ఆ తర్వాత ఆ గూగ్లీ ఆమె ట్రేడ్ మార్క్‌గా మారింది.
2018లో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఇద్దరు బౌలర్లలో ఈమె కూడా ఒకటి. 2018 సెప్టెంబరులో టీ ట్వంటీ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అప్పటి వరకు ఆ రికార్డు ఝులన్ గోస్వామి పేరిట ఉండేది.[1]
2018-19 సంవత్సరానికి గానూ బీసీసీఐ పూనమ్‌ను బెస్ట్ వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది.
2019లో క్రికెట్ క్రీడలో అద్వీతయమైన ప్రతిభ చూపినందుకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది.[2]
2020లో తన అద్భుత ప్రదర్శన ద్వారా తొలిసారిగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టు ప్రవేశించగల్గింది. కానీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చవి చూసింది.
2021 మేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన ఏకైక మ్యాచ్ కోసం భారత టెస్ట్ జట్టులో ఆమె ఎంపికైంది.[4] 2022 జనవరిలో న్యూజిలాండ్ లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఆమె ఎంపికైంది.[5]
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టీం ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయరాలు పూనమ్ మాత్రమే.[6]
మొత్తం 18 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసి టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది . అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ఆమె కేవలం ఓవర్‌కి. 5.6 రన్స్ మాత్రమే ఇచ్చారు. సరిగ్గా ఈ ప్రదర్శనే ఆమె ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 7 బౌలర్‌గా నిలిపింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Sheefali Mahant, Sheefali Mahant; Poonam Yadav, Poonam Yadav (2015-06-30). "Personalized Medicines: Reforming Diagnostics and Therapeutics". Journal of Basic & Applied Sciences. 11: 418–427. doi:10.6000/1927-5129.2015.11.59. ISSN 1927-5129.
- ↑ 2.0 2.1 2.2 शुक्ला, ओ.पी. बी. (2017-04-15). "भारत में न्यायपालिका की भूमिका: न्यायिक सक्रियता के सन्दर्भ में". विचार. 10 (01). doi:10.29320/jnpgvr.v10i01.11051. ISSN 0974-4118.
- ↑ Cricket, Team Female (2019-08-24). "The inspiring cricket journey of Poonam Yadav | Struggles | Career | Rankings | Stats | Arjuna Award". Female Cricket (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
- ↑ "India's Senior Women squad for the only Test match, ODI & T20I series against England announced". Board of Control for Cricket in India. Retrieved 14 May 2021.
- ↑ "Renuka Singh, Meghna Singh, Yastika Bhatia break into India's World Cup squad". ESPN Cricinfo. Retrieved 6 January 2022.
- ↑ MelbourneMarch 9, Indo-Asian News Service; March 9, 2020UPDATED:; Ist, 2020 13:35. "Poonam Yadav lone Indian in Women's T20 World Cup Team of the Tournament, Shafali Verma 12th woman". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)