ఫూలన్ దేవి

వికీపీడియా నుండి
(పూలన్ దేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫూలన్ దేవి
200px
జననం (1963-08-10) 1963 ఆగస్టు 10
గోర్హా కా పుర్వా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
మరణం 2001 జూలై 25 (2001-07-25)(వయసు 37)
కొత్త ఢిల్లీ, భారతదేశం
వృత్తి బందిపోటు,రాజకీయ నాయకురాలు
జీవిత భాగస్వామి కుట్టిలాల్, విక్రమ్, ఉమ్మేద్ సింగ్

ఫూలన్ దేవి భారతదేశంలో పేరుగాంచిన ప్రముఖ బందిపోటు దొంగలలో ఒకతే. ఈమె చంబల్ లోయలో తనకు బాల్యంలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సొంత ముఠాను ఏర్పరుచుకొని బందిపోటు నాయకురాలిగా ఎదిగింది. తరువాత ప్రభుత్వానికి లొంగిపోయి రాజకీయాలలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సమాజ్ వాద్ పార్టీ ఆమె పై వున్న అన్ని నేరాలను కొట్టి వేసింది. ఆ కారణంగా జైలు నుండి బయటకు వచ్చిన పూలన్ దేవి సమాజ్ వాది పార్టీ తరపున లోక్ సభకు పోటి చేసి 1996 లో గెలుపొందారు. కాని ఆమె పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున కొంత మంది శత్రువులు 25 జూలై 2001 నాడు ఆమెను ఆమె ఇంటి ముందే ముసుగులు ధరించి కాల్చి చంపేశారు.

సుదీర్ఘ విచారణ తర్వాత పూలన్ దేవి హంతకుడుగా షేర్ సింగ్ రాణాను నిర్ణయించి ఢిల్లీ కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అతడికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది. 2014 ఆగస్టు 8న అతడిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆగస్టు 12న శిక్ష ఖరారవుతుందని భావించినా రెండు రోజులు ఆలస్యంగా తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు హత్యకు గురైయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. అదే విధంగా ఒక సినిమా కూడా వచ్చింది.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఫూలన్_దేవి&oldid=1998414" నుండి వెలికితీశారు