Jump to content

పెడబల్లి వెంకట సిద్దారెడ్డి

వికీపీడియా నుండి
పెడబల్లి వెంకట సిద్దారెడ్డి
Ex ఎమ్మెల్యే
Assumed office
2019 - 2024
అంతకు ముందు వారుఅత్తర్ చాంద్ భాష
తరువాత వారుకందికుంట వెంకట ప్రసాద్
నియోజకవర్గంకదిరి నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం04 ఆగష్టు 1968
కదిరి, అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీఇండిపెండెంట్
ఇతర రాజకీయ
పదవులు
YSRCP,కాంగ్రెస్ పార్టీ , ప్రజారాజ్యం పార్టీ
జీవిత భాగస్వామిడా.ఉషారాణి
సంతానంద్యుతి , ప్రణతి
తల్లిదండ్రులుచిన్న గంగిరెడ్డి, కమలమ్మ
నివాసంకదిరి

పెడబల్లి వెంకట సిద్దారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పెడబల్లి వెంకట సిద్దారెడ్డి 04 ఆగష్టు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా , కదిరిలో చిన్న గంగిరెడ్డి, కమలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్ పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం ఆయన 2011లో కాంగ్రెస్ పార్టీలో చేరి, రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చాంద్‌బాషా గెలుపులో కీలకంగా పని చేశాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చాంద్‌బాషా వైసీపీ నుండి టీడీపీలో చేరడంతో 2016 నుంచి∙వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశాడు. డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి 2019 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ పై 27243 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

2024ఎన్నికల్లో ఈయన కు టికెట్ రాలేదు అని కారణం గా పార్టీ వ్యతిరేకకార్యక్రమలకు పాల్పడుతున్నారని 2024జులై 9వ తేదిన పార్టీ అధ్యక్షులు YS జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ను YSR కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యటం జరిగింది. [²]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌ సీపీ అనంతపురం అభ్యర్థులు వీరే." Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  2. Sakshi (25 May 2019). "కొత్త కొత్తగా ఉన్నది". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.