పెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దమ్మ గుడి ప్రధానాలయం

శ్రీ పెద్దమ్మ దేవాలయం హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది.[1] హైదరాబాదులోని పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. దివంగత మాజీ మంత్రి పి.జనార్థనరెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి, ఏడు అంతస్తుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రప్రతిష్ఠాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయిబిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

గుడి ఆవరణలో పి.జనార్ధనరెడ్డి విగ్రహం

చరిత్ర

[మార్చు]

పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాతంలో ఉండగా, 2000వ సంవత్సర కాలంనుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా వుండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో, సహజంగానే పల్లెవాసాలు అదృశ్య మయ్యాయి. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతోంది.[2]

గోశాల, పెద్దమ్మ గుడి

ఉత్సవాలు

[మార్చు]

ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది.హైదరాబాదు సికింద్రాబాదు జంటనగరాలు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తుంటారు.[3]

సినిమా పరిశ్రమ

[మార్చు]

ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంటుగా మారింది.

ఆలయ ఆస్తి వివాదం

[మార్చు]

ఈ ఆలయానికి భారీగా స్థిరాస్థులు ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదు నగరం వేగంగా అభివృద్ధి చెందటంతో మిగతా పురాతనమైన అలయాలలాగానే ఈ ఆలయ స్థిరాస్థులు కూడా కబ్జాదారుల కబందహస్తాలలోకి కొంచం కొంచంగాకరిగి పోతున్నాయి.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పెద్దమ్మ ఆలయంలో అలజడి, ది హిందు వార్తాపత్రికలో కథనం. 5 సెప్టెంబరు, 2007.
  2. "పెద్దమ్మ గుడి". ap7am.com. ap7am.com. Archived from the original on 26 ఆగస్టు 2013. Retrieved 17 November 2014.
  3. ఆలయాల్లో దసరా శోభ , ఆంధ్రప్రభ దినపత్రికలో కథనం. 14 అక్టోబరు, 2013
  4. "పరమాత్మ.. పరాధీనం". suryaa.com. ఎస్.పి.ఆర్ పబ్లికేషన్స్ (పై)లిమిటెడ్. Retrieved 17 November 2014.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]