పెద్ది సుదర్శన్ రెడ్డి
పెద్ది సుదర్శన్ రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2018 - ప్రస్తుతం | |||
ముందు | దొంతి మాధవ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నర్సంపేట శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగస్టు 6, 1974 నల్లబెల్లి, నల్లబెల్లి మండలం, వరంగల్ గ్రామీణ జిల్లా | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | పెద్ది రాజిరెడ్డి,[1] అమృతమ్మ | ||
జీవిత భాగస్వామి | స్వప్న | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | నర్సంపేట, వరంగల్ రూరల్, తెలంగాణ |
పెద్ది సుదర్శన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు.[2] తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[3]
జననం
[మార్చు]సుదర్శన్ రెడ్డి 1974, ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించాడు. 1991లో వరంగల్ లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.[4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ గారు 2001లో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పిటిసి గా గెలుపొంది జెడ్పీ ఫోర్ లీడర్ గా కొనసాగారు.
2004 డిసెంబర్ లో జిల్లా పార్టీ కన్వీనర్ గా ఎన్నిక కావడం జరిగింది. 2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎనిమిది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించాడు. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా (పొలిటికల్ బ్యూరో ప్రారంభం నుండి రద్దయ్యే వరకు) పనిచేస్తూ.. కేసిఆర్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్రస్థాయిలో రాజకీయ గుర్తింపును పొందాడు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని జరిగాయి.
తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[3]
సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (14 July 2021). "ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృ వియోగం". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
- ↑ "Member's Profile - Telangana-Legislature". telanganalegislature.org.in. Retrieved 2021-08-20.[permanent dead link]
- ↑ 3.0 3.1 telugu, NT News (22 August 2023). "వరంగల్ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
- ↑ "Peddi Sudharshan Reddy | Chairman of Civil Supplies Corporation | MLA | Nallabelli | Warangal | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-26. Retrieved 2021-08-20.
- ↑ Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.