Coordinates: 13°55′12″N 78°11′42″E / 13.92°N 78.195°E / 13.92; 78.195

పెద్ద ఎద్దులవారిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్ద ఎద్దులవారిపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెద్ద ఎద్దులవారిపల్లి is located in Andhra Pradesh
పెద్ద ఎద్దులవారిపల్లి
పెద్ద ఎద్దులవారిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 13°55′12″N 78°11′42″E / 13.92°N 78.195°E / 13.92; 78.195
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం తనకల్లు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"పెద్ద ఎద్దులవారిపల్లి" అనంతపురం జిల్లా తనకల్లు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

మొరవపల్లి వెంకటరమణారెడ్డ్ (ఎం.వి.రెడ్డి):- ఇతను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, బి.పి.టి - 5204 సాంబమసూరి వరి వంగడం సృష్టికర్త. వీరు ఈ గ్రామంలో, 1929 అక్టోబరు-3న ఒక రైతు కుటుంబంలో జన్మించినారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1954లో ఏ.జీ,బి.ఎస్.సి., 1958లో ఏ.జీ.ఎం.ఎస్.సి., పూర్తిచేశారు. 1967లో అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి.పట్టా పొందినారు. 1980-83 మధ్య, బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ గా మరియూ జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ (జన్యు, మొక్కల ప్రజనన శాస్త్రం) విభాగం అధిపతిగా పనిచేశారు. ఈ సమయంలోనే సహచర ఆచార్యులు, బోధన పరిశోధన సిబ్బందితో కలసి, బి.పి.టి - 5204 వరి వంగడాన్ని రూపొందించారు. దీనినే సోనామసూరి, కర్నూలు సోనా అనే పేర్లతో గూడా వ్యవహరిస్తున్నారు. ఏ.పి.ఎస్.హెచ్-11 అనే ప్రొద్దుతిరుగుడు రకం, బి.పి.టి-1 అనే వేరుశనగ వంగడాలనూ రూపొందించారు. హైదరాబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ కు ప్రథమ సంచాలకులుగా, తిరుపతిలోని ప్రాంతీయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులుగా పనిచేసి, 1989 లో ఉద్యోగ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంనుండి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని, 2009లో వరిష్ట వ్యవసాయ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. వీరు, 2014,ఏప్రిల్-23న, తమ 85వ ఏట తుది శ్వాస విడిచారు.[1].

మూలాలు[మార్చు]

  1. ఈనాడు మెయిన్; 2014,ఏప్రిల్ -24; 14వపేజీ

వెలుపలి లింకులు[మార్చు]