పెనుగొండ లక్ష్మీనారాయణ
Jump to navigation
Jump to search
పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయకవి. ప్రముఖ న్యాయవాది. శ్రామిక పక్షపాతి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేస్తున్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1954, అక్టోబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు[1]. పెనుగొండ లింగమ్మ, గోవిందరెడ్డి ఇతని తల్లి దండ్రులు. బి.ఎ., బి.ఎల్ చదివాడు. న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఇతని భార్య పేరు ఉప్పుటూరి గీత. ఈమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రచనా వ్యాసంగం
[మార్చు]రచయితగా :
- విదిత (సాహిత్యవ్యాసాల సంపుటి)
- అనేక (సాహిత్యవ్యాసాల సంపుటి)
- రేపటిలోకి (కవిత్వం)
సంపాదకుడిగా :
- బల్గేరియా కవితా సంకలనం
- అరాజకీయం కవితా సంకలనం
- గుంటూరు కథలు
- కథాస్రవంతి (నాలుగు భాగాలు)
పురస్కారాలు
[మార్చు]- తెలుగు భాషాపురస్కారం
- సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం
- మిలీనియం లాయర్ పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి (2015-07-16). "సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తిగా పెనుస్తూన్న "పెనుగొండ" (కదిలించే కలాలు)". నేటి నిజం. బైసా దేవదాసు. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 July 2015.