Jump to content

పెరిటోనైటిస్

వికీపీడియా నుండి
పెరిటోనైటిస్
క్షయ నుండి పెరిటోనిటిస్
ఉచ్చారణ
ప్రత్యేకతఎమర్జెన్సీ మెడిసిన్, సాధారణ శస్త్రచికిత్స
లక్షణాలుపెరిటోనియంకు సంబంధించి వాపు, తీవ్రమైన నొప్పి, ఉదరం వాపు, జ్వరం లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలు
సంక్లిష్టతలుషాక్ (అంటే ప్రసరణ వ్యవస్థలో సమస్యల ఫలితంగా శరీర కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం), అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఒక రకమైన శ్వాసకోశ వైఫల్యం ఊపిరితిత్తులలో విస్తృతమైన వాపు )
సాధారణ ప్రారంభంఅకస్మాత్తుగా
రకాలుప్రథమ, ద్వితియ
కారణాలుపేగులలో చిల్లులు, ప్యాంక్రియాటైటిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి, కడుపు పుండు, సిర్రోసిస్ లేదా అపెండిసైటిస్
ప్రమాద కారకములుఅసైటిస్, పెరిటోనియల్ డయాలసిస్
చికిత్సయాంటీబయాటిక్స్, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, నొప్పి మందులు, శస్త్రచికిత్స
తరుచుదనముసాధారణం

పెరిటోనైటిస్ అనేది పెరిటోనియంకు సంబంధించి వాపు, తీవ్రమైన నొప్పి, ఉదరం వాపు, జ్వరం లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్న శారీరిక సమస్య. పెరిటోనియం అంటే పొత్తికడుపు లోపలి గోడ వెంబడి పొర (లైనింగ్), అంటే ఉదర అవయవాల పైన కప్పి ఉండే పొర (కవర్). [1][2] ఉదరం ఒక భాగం లేదా మొత్తం మృదువుగా ఉండవచ్చు.[3] సమస్యలలో షాక్ (అంటే ప్రసరణ వ్యవస్థలో సమస్యల ఫలితంగా శరీర కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం), అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఒక రకమైన శ్వాసకోశ వైఫల్యం ఊపిరితిత్తులలో విస్తృతమైన వాపు ) ఉండవచ్చు.[4] [5]

కారణాలు

[మార్చు]

పేగులలో చిల్లులు, ప్యాంక్రియాటైటిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి, కడుపు పుండు, సిర్రోసిస్ లేదా అపెండిసైటిస్ కారణాలు కావచ్చు.[2] సమస్య ప్రమాదంలో ఉండడానికి కారకాలలో అసైటిస్, పెరిటోనియల్ డయాలసిస్ ఉన్నాయి. [4] రోగ నిర్ధారణ సాధారణంగా శరీర పరీక్ష, రక్త పరీక్షలు మెడికల్ ఇమేజింగ్ ల ఆధారంగా ఉంటుంది. [6]

చికిత్స

[మార్చు]

చికిత్సలో తరచుగా యాంటీబయాటిక్స్, సిరలలోనికి నేరుగా ఎక్కించే ద్రవాలు (ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్), నొప్పి మందులు, శస్త్రచికిత్స ఉంటాయి. [2] [4] ఇతర చర్యలలో నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ లేదా రక్త మార్పిడిని ఉండవచ్చు. [4] చికిత్స లేకుండాఉంటే కొన్ని రోజుల్లో మరణం సంభవించవచ్చు. [4] దాదాపు 7.5% మంది ప్రజలు ఏదో ఒక సమయంలో అపెండిసైటిస్‌తో బాధపడుతున్నారు. [3] సిర్రోసిస్‌తో ఆసుపత్రిలో చేరిన వారిలో 20% మంది పెరిటోనిటిస్‌తో బాధపడుతున్నారు. [3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Peritonitis - National Library of Medicine". PubMed Health. Archived from the original on 2016-01-24. Retrieved 22 December 2017.
  2. 2.0 2.1 2.2 "Peritonitis". NHS. 28 September 2017. Archived from the original on 31 December 2017. Retrieved 31 December 2017.
  3. 3.0 3.1 3.2 Ferri, Fred F. (2017). Ferri's Clinical Advisor 2018 E-Book: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. pp. 979–980. ISBN 9780323529570. Archived from the original on 2019-12-11. Retrieved 2017-12-31.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Acute Abdominal Pain". Merck Manuals Professional Edition. Archived from the original on 13 July 2018. Retrieved 31 December 2017.
  5. "Acute Abdominal Pain". Merck Manuals Consumer Version. Archived from the original on 13 July 2018. Retrieved 31 December 2017.
  6. "Encyclopaedia : Peritonitis". NHS Direct Wales. 25 April 2015. Archived from the original on 31 December 2017. Retrieved 31 December 2017.