పెషావర్ జల్మీ అనేది పాకిస్తాన్ ఫ్రాంచైజీ ట్వంటీ 20 క్రికెట్ జట్టు. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతుంది. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని నగరమైన పెషావర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. జావేద్ అఫ్రిది ఈ జట్టుకు జట్టు యజమాని.[1][2] 2015లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రకటన తర్వాత ఈ పెషావర్ జల్మీ స్థాపించబడింది.[2] ప్రస్తుతం బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఉండగా, డారెన్ సమీ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నారు.
కమ్రాన్ అక్మల్ జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్,[3]వహాబ్ రియాజ్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు.
2015, డిసెంబరు 3న, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ నిర్వహించినపాకిస్తాన్ సూపర్ లీగ్ మొదటి సీజన్ కోసం ఐదు నగర ఆధారిత ఫ్రాంచైజీల యజమానులను ఆవిష్కరించింది. పెషావర్ ఫ్రాంచైజీని పదేళ్ల కాల వ్యవధికి US$16 మిలియన్లకు జావేద్ అఫ్రిదికి విక్రయించారు.[4][5]