హసన్ అలీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హసన్ అలీ 1959లో కడపలో జన్మించాడు.3 దశాబ్దాలకు పైగా శాసనసభతో సంబంధం ఉన్న హసన్ అలీ 1976లో సహాయ దుబాషీగా రాష్ట్ర శాసనసభలో చేరినాడు. ఆ తరువాత సీనియర్ దుబాషీగా పదోన్నతి పొందినాడు. శాసనసభ తరఫున ఫ్రొటోకాల్‌ ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరించేవాడు. దివంగత స్పీకర్‌ జి.నారాయణరావు నుంచి ఏడుగురు స్పీకర్‌ల వద్ద హసన్‌ అలీ దుబాష్‌గా వ్యవహరించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శాసనసభలో గుబురుమీసాల హసన్ అలిగా ప్రసిద్ధిచెందినాడు. 2010, ఫిబ్రవరి 19న మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 21.02.2010.
"https://te.wikipedia.org/w/index.php?title=హసన్_అలీ&oldid=491377" నుండి వెలికితీశారు