పేటిఎం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేటిఎం ఇండియా
వన్97 కమ్యూనికేషన్స్ పేటిఎం లిమిటెడ్
రకంపబ్లిక్
ISININE982J01020
పరిశ్రమ
స్థాపనఆగస్టు 2010; 14 సంవత్సరాల క్రితం (2010-08) in New Delhi, India
స్థాపకుడువిజయ్ శేఖర్ శర్మ
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవ చేసే ప్రాంతములు
కీలక వ్యక్తులు
  • Vijay Shekhar Sharma (CEO)
ఉత్పత్తులు
సేవలు
రెవెన్యూIncrease 7,990 crore (US$1.0 billion) (FY23)[2]
మూస:Negative decrease −1,730 crore (US$−220 million) (FY23)[2]
మూస:Negative decrease −1,568 crore (US$−200 million) (FY23)[2]
యజమానిs
  • Vijay Shekhar Sharma (8.92%)[3]
  • Ant Group (24.88%)
  • SVF India Holdings (Cayman) Ltd (17.46%)
  • Saif Iii Mauritius Company Ltd (10.59%)
  • Axis Trustee Services Ltd (4.77%)
  • Bh International Holdings (2.41%)
  • Canada Pension Plan Investment Board (1.71%)
సభ్యులుIncrease 35 crore
(350 million)[4] (FY19)
మాతృ సంస్థవన్97 కమ్యూనికేషన్స్

పేటిఎం (Paytm - Pay Through Mobile) భారతదేశానికి చెందిన బహుళజాతి ఆర్థిక సాంకేతిక సంస్థ. ఇది డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల రంగంలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. ఈ సంస్థను 2010 లో విజయ్ శేఖర్ శర్మ వన్97 కమ్యూనికేషన్స్ అనే సంస్థ తరఫున ప్రారంభించాడు. వీరి ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు, వ్యాపారస్థులు క్యూఆర్ కోడ్ సాయంతో ఆ చెల్లింపులు స్వీకరించవచ్చు. వీరి సంస్థ నుంచి పేమెంట్ సౌండ్ బాక్స్, ఆండ్రాయిడ్ ఆధారిత పేమెంట్ టర్మినల్, ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే లాంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

పేటిఎం సంస్థను ఆగస్టు 2010 లో దాని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని నోయిడాలో $2 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో స్థాపించాడు. ఇది మొదటగా ప్రీపెయిడ్ మొబైల్, డిటిహెచ్ రీఛార్జ్ వేదికగా ప్రారంభమై, 2013లో డెబిట్ కార్డ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్, ల్యాండ్‌లైన్ బిల్ చెల్లింపులను జోడించింది.[5]

అక్టోబరు 2011 నాటికి సాఫైర్ వెంచర్స్ (SAP Ventures) ఇందులో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.[6] జనవరి 2014 నాటికి ఈ సంస్థ పేటిఎం వ్యాలెట్ ని ప్రవేశ పెట్టింది. దీనిని భారతీయ రైల్వేలు, క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ సంస్థలు ఒక చెల్లింపు విధానంగా చేర్చాయి.[7] తర్వాత నెమ్మదిగా ఈ కామర్స్, బస్ టికెట్ల రంగంలోకి కూడా ప్రవేశించింది. 2015 నాటికి విద్యాలయాల ఫీజులు, మెట్రో, గ్యాసు, విద్యుత్, నీళ్ళ బిల్లుల చెల్లింపులు ప్రవేశ పెట్టింది.[8] ఆగస్టు 2014లో 1.18 కోట్లుగా ఉన్న పేటిఎం వినియోగదారులు ఆగస్టు 2015 నాటికి 10.4 కోట్ల మంది అయ్యారు. దీని ట్రావెల్ వ్యాపారం GMV (Gross Merchandise Value) 500 మిలియన్ డాలర్లు దాటింది. నెలకు 20 లక్షల టిక్కెట్లు ఇందులో బుక్ అయ్యాయి.[9]

మూలాలు

[మార్చు]
  1. "Paytm's gaming platform Gamepind rebranded as FirstGames". Business Today.
  2. 2.0 2.1 2.2 "Statement of Consolidated Audited Financial Results for the year ended March 31, 2023" (PDF). BSE. Retrieved 19 May 2023.
  3. "one 97 communications ltd". bseindia.com.
  4. "Paytm achieves of GTV growth over $50 billion in (FY2019), clocks 5.5 billion transactions". The Hindu. 5 June 2019. Retrieved 30 September 2019.
  5. "The inspiring journey of Paytm Founder Vijay Shekhar Sharma". Paytm Blog. 2017-03-11. Archived from the original on 2020-01-02. Retrieved 2018-04-04.
  6. "SAP Ventures Invests $10M In One97 Communications". VCCircle (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-10-10. Retrieved 2019-02-10.
  7. "Paytm's big day: railway ticketing platform IRCTC adds Paytm wallet as a payment option". Techcircle (in అమెరికన్ ఇంగ్లీష్). 29 April 2015. Retrieved 2018-04-04.
  8. "Paytm is now powering IRCTC's Payment Gateway". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-16. Retrieved 2018-04-07.
  9. Chaturvedi, Anumeha (2017-08-24). "Paytm bets on local travel boom, eyes 3-fold business growth". The Economic Times. Retrieved 2018-04-07.
"https://te.wikipedia.org/w/index.php?title=పేటిఎం&oldid=4228784" నుండి వెలికితీశారు