Jump to content

పేరాల

వికీపీడియా నుండి
(పేరాల పట్టణము నుండి దారిమార్పు చెందింది)

పేరాల: చీరాల పట్టణ ప్రాంతం.

పేరాల ఉద్యమం

[మార్చు]

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. గోపాలకృష్ణయ్య వేయిమంది సభ్యులతో రామదండు అనే వాలంటీర్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినపుడు గోపాలకృష్ణయ్య సమస్య వివరించాడు. గాంధీ చీరాలను సందర్శించి ఊరు ఖాళీ చేసిపోతే మున్సిపాలిటీ దానంతట అదే రద్దవుతుందని ఆలోచన చెప్పాడు. గోపాలకృష్ణయ్య చీరాల, పేరాల ప్రజలను ఊరు ఖాళీచేయించి[1] దాని పొలిమేర అవతల రామ్‌నగర్ పేరుతో కొత్త నివాసాలు ఏర్పర్చాడు. అక్కడ 11 నెలలపాటు కష్ట నష్టాలని అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం అతనిని నిర్భందించి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. దీంతో చేసేదేమీ లేక ప్రజలు తమ నివాసాలకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

విశేషాలు

[మార్చు]
  • ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న కౌతవరపు రాజేంద్రప్రసాద్, ఐదుపైసల నాణేలతో వివిధ రకాల కళాకృతులను రూపొందించినందుకు, "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం సంపాదించుకున్నారు. గతంలో ఇతను ఐదుపైసల నాణేలతో చార్మినార్, శివలింగం, ఓడ, కంటివైద్యశాల, వి.ఆర్.ఎస్., వై.ఆర్.ఎన్. కలాశాలల నమూనా తయారుచేసినందుకు, ఈ అరుదైన గుర్తింపు లభించింది. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గూడా ఇతని పేరు నమోదయింది. కళారత్న, ఆంధ్రరత్న తదితర పురస్కారాలతోపాటు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యత్వం గూడా లభించింది.
  • పేరాలకు చెందిన మురళీకృష్ణ అను 9వ తరగతి విద్యార్థి, ఏ-4 సైజు కాగితాలతో వివిధ రకాల వస్తువులు తయారుచేయుచూ అందరినీ అబ్బురపరచుచున్నాడు. హంస, బంతి, జాతీయ జండా, ఫ్లెక్సిబుల్ బాల్, తామర, వివిధ రకాల పుష్పాలు రూపొందించుచున్నాడు. భారతదేశం 2015 వ సంవత్సరంలో క్రికెట్టులో ప్రపంచకప్పు గెలవాలని కాంక్షించుచూ, 360 కాగితాలు, పిన్నులు, జిగురు ఉపయోగించి, ప్రపంచకప్పు నమూనాను, అన్ని దేశాల రంగులతో తీర్చిదిద్దినాడు. [1] స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొనే బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు.

మౌలిక వసతులు

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]

భారతీయ స్టేట్ బ్యాంక్, పేరాల శాఖ.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు, పద్మసాలీలు పలువురు నేతపని చేస్తారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • పునుగు శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవాలయం
  • శ్రీ మదనగోపాలస్వామివారి దేవాలయం

ఈ రెండు ఆలయాలదీ 300 సంవత్సరాల చరిత్ర. ఆ రోజులలోనే దాతలు నిర్వహణకై శివాలయానికి 8.35 ఎకరాలూ, మదనగోపాలునికి 12 ఎకరాలూ నిర్వహణకు, భూమిని విరాళంగా అందజేసారు. ఈ భూములు అన్యాక్రాంతమై, ఆలయాల నిర్వహణ తీరు బాగుగా లేదు.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 83

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పేరాల&oldid=4274158" నుండి వెలికితీశారు