Jump to content

మృణ్మయ పాత్రలు

వికీపీడియా నుండి
(పొంత నుండి దారిమార్పు చెందింది)
మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామంలో కుండలు చేస్తున్న కుమ్మరి.
శ్రీకాకుళం పట్టణంలో కుండలు తయారుచేస్తున్న కుమ్మరి.
Pottery

బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు. వీటిని ఆంగ్లంలో సిరామిక్స్ అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రథమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము కుండలు. మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి ఉన్నాయి.

ఉపయోగాలు

[మార్చు]
  1. భవన నిర్మాణములో ఇటుకలుగా, పెంకులుగా
  2. లోహ పరిశ్రమతో కొలిమి నిర్మాణాలకు
  3. రసాయన పరిశ్రమలో రాతి సామాగ్రి, పింగాణీ సామాగ్రిగా
  4. పారిశుధ్య, మురుగునీటి పారుదల పనులతో రాతి సామాగ్రిగా
  5. చైనా పింగాణీగా శుభ్రత పరిరక్షణలో
  6. విద్యుత్ పరిశ్రమలో విద్యుత్ బంధకాలుగా, పింగాణీ సామాగ్రిగా

ముడి పదార్థాలు సిరామిక్స్ తయారీకి వాడే ముడి పదార్థాలు; a బంకమన్ను b పెల్‌స్ఫార్ అనే ఖనిజము c ఇసుక.

బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా (Al2O3) సిలికా (SiO2) లను, కొంత పరిమాణంలో (Na2O, K2O, MgO, CaO) లను కలిగి ఉంటుంది.

విధానము

[మార్చు]

ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికి తగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 20000C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 0C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 0C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 0C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిశ్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.

చెరువు నుండి మెత్తటి ఒండ్రు మట్టిని సేకరించి తీసుక వచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో వున్న చిన్న చిన్న రాళ్లను వేరు చేసి దానిని నీళ్లతొ తడిపి నాలుగైదు రోజులు ముగ్గ బెడతారు. ఆ తర్వాత దానికి నీళ్లు కలిపి కాళ్లతో బాగా తొక్కు తారు. అలా తయారైన మట్టిని సుమారు ఒక అడుగు కైవారం రెండడుగులు ఎత్తు వున్న స్థూపాకారంగా తయారు చేసి దానిని కుమ్మరి చక్రం మధ్యలో పెడతారు. ఆ కుమ్మరి చక్రం సుమారు రెండడుగుల వ్యాసార్థం కలిగి క్రింద ఒక చిన్న లోహపు బుడిపె వంటిది వుంది అది క్రింద నున్న మరొక లోహపు గిన్నె పై నిలబడి బాలెన్సుడుగా నిలబడి వుంటుంది. ఆ చక్రానికి ఒక చోట సుమారు ఒక అంగుళం లోతున ఒక చిన్న రంధ్రం వుంటుంది. కుమ్మరి ఆ రంధ్రంలో ఒక కర్రను పెట్టి చక్రాన్ని తిప్పు తాడు. అది చాల వేగంగా తిరుగు తుంది. అప్పుడు దానిమీద వున్న మట్టి ముద్ద కూడా తిరుగు తుంది. అప్పుడు కుమ్మరి చక్రానికి అవతల నిలబడి వంగి తన చేతులతో చక్రంపై వున్న మట్టి ముద్ద పైబాగాన కొంత మట్టిని ఒడిసి పట్టి తనకు కావలసిన కుండ మూతి ఆకారానికి మలుస్తాడు. కొత్త ఆకారాల కొరకు అతడు చిన్న చిన్న పుల్లలను వాడు తాడు. చక్రం వేగంగా తిరుగు తున్నందున కుమ్మరి తన చేతులతొ మట్టిపై వత్తిడి కలుగ జేసినందున అది గుండ్రటి ఆకారానికి వస్తుంది.

అలా పూర్తిగా కుండ ఆకారానికి రాగానె ఒక సన్నని పుల్ల తీసుకొని కుండ అడుగు బాగాన గుచ్చుతాడు. అప్పుడు చక్రం వేగంగా తిరుగు తున్నందున దానిపై వున్న మట్టి ముద్దకు పైన తయారైన కుండకు బంధం తెగి పోయి కుండ మట్టి ముద్దపై అలానె వుంటుంది. అప్పుడు కుమ్మరి ఒడుపుగా ఆకుండను తీసి క్రింద పెడతాడు. అప్పుడు కుండకు అడుగు భాగం వుండదు. అక్కడ ఖాళీగా పైమూతి లాగానె ఒక పెద్ద రంధ్రం వుంటుంది.

చక్రం వేగం తగ్గితె మరలా కర్ర తీసుకొని దాని వేగాన్ని పెంచు తారు. అలా చక్రం పైనున్న మట్టి అంతా అయిపోయి నంతవరు కుండలను, కూజాలను, ఇతర పాత్రలను చేసి వాటిని పక్కన పెడతాడు. అలా తయారయిన ఆ పాత్రలు పచ్చిగా వున్నందున అతి సున్నితంగా వుంటాయి. వాటిని అలా నీడలో ఒక రోజు ఆర బెట్టితె కొంత వరకు గట్టి పడతాయి. అప్పుడు కుమ్మరి ఒక్కొక్క పాత్రను తన ఒడిలోనికి తీసుకొని ఎడం చేతిలోని ఒక అతి నునుపైన రాయిని తీసుకొని, కుండ లోనికి పెట్టి లోపల కుండ అంచులకు తాకించి కుడి చేత్తో కుండ పైన క్రింద రాయి ఆనించిన భాగాన మెత్తగా కొడతాడు. అలా కుండ ఉపరితలమంతా కొట్టగా ఆ మెత్తటి కుండ సాగి అడుగున వున్న రంధ్రం మూసుక పోతుంది. అప్పుడు దానిని నీడలో పక్కన పెడతాడు. అదే విదంగా కుండలన్ని పూర్తిగా చేసి రెండు రోజులు నీడలో ఆర బెడతారు.

కుమ్మరి వామి

[మార్చు]

కుమ్మరి వామి అనగా ఆరిన కుండలను కాల్చడానికు ఉపయోగించె ఒక పొయ్యి లాంటిది. ఇది అర్థ చంద్రాకారంలో వుండి మధ్యలో సుమారు మూడడుగుల ఎత్తు వుండి క్రింద ఒక ఆడుగు కైవారంతొ ఒక రంధ్రం వుండి ఒకడుగు మందంతో గోడ వుండి ఆ గోడ రాను రాను ఎత్తు తగ్గి చివరకు భూమట్టానికి వుంటుంది. దీనినే కుమ్మరి వామి అంటారు. ఆరిన కుండలను ఇందులో నిండుగా వరుసగా పేర్చి తర్వాత అన్నికుండలకు కలిపి పైన చెత్త, ఇతర ఆకులు అలుములతో కప్పులాగ వేసి దానిపై బురద మట్టితో ఒక పొరలాగ అంతటికి ఒక కప్పు వేస్తారు. ఇప్పుడు ముందున్న రంధ్రంలో చెత్త, కంపలు మొదలగునవి వేసి మంట పెడతారు. అలా సుమారు ఒకరోజు కాల్చి ఆ తర్వాత దాన్ని అలాగే వదెలేస్తారు. ఆ వామి చల్లారిన తర్వాత ఒక వైపున మెల్లిగా పైనున్న కప్పును తొలగించి తనకు కావలసిన కుండలను తీసుకొంటారు. ఆ విదంగా కుమ్మరి కుండలను తయారు చేస్తారు.

మృణ్మయ పాత్రల పరిశ్రమ

A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel

మృణ్మయ పాత్రల పరిశ్రమలో మట్టి పాత్రలు, గోడ పెంకులు, పింగాణీ విద్యుత్ బంధనాలు, శుభ్రతా పరిరక్షణ పాత్రలు, మెరుపుగల గోడ పెంకులు మున్నగునవి ఉన్నాయి. మృణ్మయ పాత్రలను రెండు రకాలుగా విభజింపవచ్చు.

  1. సాధారణ కుండ పాత్రలు (టెర్రాకోటా లేక పోటరీ)
  2. మృత్తికా పాత్రలు (ఎర్థన్ వేర్)

సాధారణ కుండ పాత్రలు

[మార్చు]

ఇది సాధారణ బంక మన్ను నుండి తయారుచేసే పాత్రలు. సచ్చిద్ర పాత్రలైన కుండలు, కూజాలు, సాదహరణ ఇటుకలు, పైకప్పు పెంకులు మొదలైనవి. వీటికి మెరుపు ఉండదు.kaani వాటి తయారీలో ఉష్ణోగ్రత 11000C వరకు మాత్రమే పెరుగుతుంది. అందుచేత ఇవి గట్టిగా ఉండవు.

కుండపాత్రలకు ఉపయోగించు మట్టి రకాలు

[మార్చు]

కింది కుండల ఉపయోగిస్తారు మట్టి వివిధ రకాల జాబితా

  1. కయోలిన్ : దీనిని చైనా మట్టి అనికూడా అంటారు. ఎందుకంటే దీనిని ఎక్కువగా చైనాలో ఉపయోగిస్తారు.
  2. బాల్ మట్టి : యిది పాస్టిక్ వలె ఉంటుంది. యిది చూర్ణం చేయబడిన సెడిమెంటరీ మట్టి. యిది కొన్ని సేంద్రియ పదార్థములు కలిగి ఉంటుంది. దీనిని చాలా కొద్దిమొత్తంలో పోర్సలైన్ కు కలిపి ప్లాస్టిసిటీని పెంచుతారు.
  3. ఫైర్ క్లే
  4. స్టోన్ వేర్ క్లే

గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు

[మార్చు]

ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.

నీళ్ల తొట్టి

[మార్చు]

గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే తొట్టి అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే కుడితి అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడా ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటుతో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి. ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.

పొంత

[మార్చు]

పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాశ్వతంగా వుండేటట్టు మట్టితో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని బాన లేదా దొంతి అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.

బుడిగి

[మార్చు]

బుడిగి అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.

ఇది మట్టితో చేసిన పెద్ద మట్టి పాత్ర. కుండ కన్నా పెద్దది. ఇందులో నీళ్ళను నిలువ చేసుకోవడానికి వాడుకుంటారు. బానలో నీళ్ళు కాగ బెట్టుకుంటారు. అప్పుడు దాని పేరు పొంత అంటారు. వీటిలో ధాన్యము, బియ్యము, పప్పులు మొదలగువాటిని కూడా నిల్వ ఉంచు కుంటారు. అప్పుడు దాని పేరు దొంతి . వీటిని వాటి పరిమాణాన్ని బట్టి క్రింద పెద్దది, దానిపైన కొంచెం చిన్నది, దానిపైన మరి కొంత చిన్నది.... అలా చివరిలో ఒక సట్టిని పెట్టె దాని పై మూతగా ఒక మూకుడును పెడతారు. గతంలో ఇళ్ళలో ఇలాంటి దొంతుల వరుసగా వుండేవి. అలా దొంతులు నేల పై పొందికగా వుండడానికి భూమిపై ఒక చుట్ట కుదురును పెడతారు. ఒక దానిపి ఒకటి పెట్టి అందులో పప్పులు, ధాన్యము నిలవ వుంచుకుంటారు.

ఆకారాలు చేసే పద్ధతులు

[మార్చు]

మృత్తికా పాత్రలు

[మార్చు]

ఇవి ఎర్ర బంకమన్ను, బూడిద రంగు గల బంకమన్ను నుండి తయారుచేయబడతాయి. వీటి తయారీలో ఉష్ణోగ్రత 1450 - 1800 0C వరకు పెరుగుతుంది. అందుచేత ఇవి చాల గట్టిగా ఉంటాయి. మెరుపు కొరకు, క్వార్ట్జ్, ఫెల్‌స్ఫార్, కొంచెం బోరాక్స్, కొద్ది పరిమాణంలో లెడ్ ఆక్సైడ్ మిశ్రమాన్ని విసిరి జల్లించి సన్నని పొడిగా మారుస్తారు. ఈ పొడికి తగినంత నీరు కలిపి పలచని లేపనము తయారు చేస్తారు. ఎండిన మట్టి పాత్రలను ఈ పల్చని లేపనములో ముంచి బయటకు తీసి అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. ఇలా తయారైన పాత్రలు మెరుపును కలిగి ఉంటాయి. స్పార్క్ ప్లగ్ లు, విద్యుత్ బంధకపు పింగాణీ వస్తువులు, కుప్పెలు, వంటింటి సామాగ్రి, పింగాణీ కుండలు, మెరుపుగల గోడ పెంకులు మొదలైనవి మృత్తికా పాత్రలకు ఉదాహరణములు

కుటీర పరిశ్రమగా కుమ్మరం

[మార్చు]
కుమ్మరి చక్రంపై కుండ చేయుట (టర్కీలో తీసిన చిత్రం)
కుమ్మరి తయారు చేసిన కుండలు. వనస్తలిపురం, హైదరాబాదులో తీసిన చిత్రం

కొందరు కుమ్మరులు దీనిని ఒక పరిశ్రమగా కూడా విస్తరించి, కేవలం కుండల వరకే కాక మట్టితో వివిధ రకాలైన అలంకరణ సామగ్రి సైతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వృత్తి వారు గతంలో వున్నంత లేకున్నా వున్నవారు కొన్ని కుండలు, ఎక్కువగా పట్టణాలలో కూజాలు, ఎక్కువగా పెద్ద భవంతులలో అలంకరణ సామాగ్రి చేసి అమ్ముతున్నారు. అవి ఎంతో ఆకర్షణీయంగా కూడా వుంటున్నవి. ఇవిగాక పూల కుండీలు కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నవి. ఈ వృత్తి పూర్తిగా కనుమరుగయే అవకాశం లేదు.

మట్టితో చేసిన కళాత్మకమైన కుండలు, ఇతర అలంకరణ వస్తువులు.. మలక పేట రోడ్డు ప్రక్కన తీసిన చిత్రం

కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడా ప్రతి ఫలితానిki 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్ళి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు. ఇవి పెళ్ళిలో అత్యవసరం. అదే విధంగా ఎవరైనా మరణించినా ఆ కార్యక్రమాలకు కొత్త కుండలు అత్యవసరం. వాటిని కుమ్మరి సమకూర్చే వాడు. ఈ కుమ్మరి వ్వవస్త చాల కాలం క్రితమే కనుమరుగైనది. మట్టి కుండల స్థానంలో లోహ పాత్రలు వచ్చినందున వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పెళ్ళిల్లలో అరివేణి కుండలు ఏనాడో మాయమైనవి. కాని మరణానంతర కార్యాలకు మాత్రం కొత్త కుండల అవసరం ఈ నాటికి తీరలేదు. వాటికొరకు కొన్ని పల్లెల్లో, పట్టణాలలో కొనుక్కోవాలి. ఆవి అరుదుగానైనా దొరుగుతున్నాయి. మట్టి కుండల అవసరము శుభాశుభ కార్యక్రస్మాలకేకాకుండా........ అనేక దేవాలయాలలో కొత్త మట్టి కుండలలోనే మొదటి ప్రసాదము వండుతారు. ఇది ఒక సంప్రదాయము.

అత్యంత కళాత్మకమైన మట్టి పాత్రలు, ఇతర ఆలంకరణ వస్తువులు. మలకపేట రోడ్డు పక్కన తీసిన చిత్రం

కాని ఈ కాలంలో మట్టి తోచేసిన ఇతర అలంకరణ వస్తువులు రంగు రంగులవి, ఎంతో కళాత్మకమైనవి తయారవుతున్నాయి. ఇలాంటివి కేవలం పట్టణ వాసులకే పరిమితం అయ్యాయి. వీటిని పెద్ద పెద్ద ప్రదర్శన శాలలోనె గాక రోడ్డు ప్రక్కన కూడా అమ్ముతున్నారు. కళాత్మకమైన వీటి ధరలు అధికమె.

మట్టి కుండలు గతంలో ప్రతి ఇంట్లోను అత్యవసరం. నీళ్లు తాగె గ్లాసులు తప్ప ఇంకొన్ని చిన్న వస్తువులు తప్ప మిగతావి అన్ని మట్టితో చేసినవే. అదొక సాంప్రదాయం. మట్టి కుండల్లో చేసిన వంటలు రుచిగా వుంటాయని నమ్మే వారు. ఆ తర్వాత కొంత కాలానికి లోహ పాత్రలు వచ్చినా కొన్ని వంటలకు మట్టి పాత్రలనే తప్పని సరిగా వాడె వారు. ఉదాహరణకు పాలు కాగ బెట్టడానికి తప్పనిసరిగా మట్టి పాత్రనె వాడె వారు. దానివలన పాలకు, మజ్జిగకు మంచి రుచి వస్తుంది. అలా పాలను కాచె మట్టి పాత్రను ''పాల సట్టి'' అనె వారు. అలా వంటింటి పాత్రలె గాక ఇళ్లలో ధాన్యం నిలవ చేసుకునే పెద్ద వస్తువులైన, ''ఓడ'', ''కాగు'' ''బాన'' ''నీళ్ల తొట్టి'' మొదలగునవి కూడా మట్టితో చేసినవే. ప్రస్తుతం ఇటువంటివి చాల వరకు కనుమరుగైనవి. కొన్ని ఇళ్లల్లో పాతవి కొన్ని ఇప్పటికి కనబడతాయి. లోహ పాత్రలు అందు బాటులోకి వచ్చింతర్వాత కుమ్మరి వృత్తి పూర్తిగా కనుమరుగైనది. వారు తమ బ్రతుకు తెరువుకు ఇతర మార్గాల వైపు మరలి పోయారు. కుమ్మరి మట్టితో కుండలను చేసె విధానము చాల సున్నితమైనై. నేర్పరి తనం కలిగినది, జాగ్రత్తగా చేయ వలసినది.

కుమ్మరి తయారు చేసిన "అరివేణి కుండ" (అయిరేని) గతంలో ఈ కుండలు పెళ్ళిల్లో తప్పని సరి. ఇది కొత్త పేట రైతు బజారు వద్ద తీసిన చిత్రం:
  • కుమ్మరి కుండలను తయారు చేయు విధానము
కూజాలు ఇతర నీటిని నింపె మట్టి పాత్రలు; కొత్తపేట రౌతు బజారు వద్ద తీసిన చిత్రం
అలంకార వస్తువులుగా మట్టి పాత్రలు

ప్రస్తుత కాలంలో అలంకార వస్తువులుగా అనేక మట్టి పాత్రలు పట్టణాలలో కనబడు తున్నాయి. పెద్ద పెద్ద కూజాల వంటి పాత్రలు, వాటిపై అనేక అలంకారలతో, లతలు, పువ్వులు మొదలగు అలంకారాలతో ఎంతో అందంగా కనబడు తున్నాయి. అలాగే ఇండ్లలో వేలాడదేసె వస్తువులు మొదలగునవి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి అధిక ధరలు కలిగి వుంటాయి. నీళ్లకు కూజాలు, కుండలు, దీపావళికి ప్రమెదెలు మొదలగు మట్టి పాత్రలు పట్టణాలలో ఇప్పటికి కనబడుతూనె ఉన్నాయి. అంతరించి పోతున్న కుమ్మరి వృత్తికి పాత వాసనలు తెలియ జేయడాని ఇవే ఆధారాలు.

కుండలు తయారీ విధానం