పొన్నుసామి వేణుగోపాల్
Jump to navigation
Jump to search
పొన్నుస్వామి వేణుగోపాల్ | |||
పదవీ కాలం 2009 - 2019 | |||
నియోజకవర్గం | తిరువళ్లూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] మప్పేడు, తిరువళ్లూరు, తమిళనాడు, భారతదేశం | 1952 ఏప్రిల్ 28||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఏఐఏడీఎంకే | ||
తల్లిదండ్రులు | పొన్నుస్వామి, కమల | ||
జీవిత భాగస్వామి | జయలక్ష్మి | ||
సంతానం | 03 | ||
పూర్వ విద్యార్థి | స్టాన్లీ మెడికల్ కాలేజీ, చెన్నై | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, & డాక్టర్ |
పొన్నుసామి వేణుగోపాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తిరువళ్లూరు నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]పొన్నుసామి వేణుగోపాల్ 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తిరువళ్లూరు నియోజకవర్గం నుండి ఏఐఏడీఎంకే అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి డిఎంకె అభ్యర్థి గాయత్రి.ఎస్‌పై 31,673 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో ఏఐఏడీఎంకే అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వీసీకే పార్టీ అభ్యర్థి డి. రవి కుమార్ పై 323430 ఓట్లు భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]
పొన్నుసామి వేణుగోపాల్ 2019లో ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కె. జయకుమార్ చేతిలో 356955 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
పార్లమెంట్‌లో నిర్వహించిన పదవులు
[మార్చు]# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
01 | 2009 | - | సభ్యుడు, 15వ లోక్‌సభ |
02 | 31-ఆగస్ట్-2009 | - | నీటి వనరుల కమిటీ సభ్యుడు |
03 | 31-ఆగస్ట్-2009 | - | మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ |
04 | 31-ఆగస్ట్-2009 | - | పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆహార నిర్వహణపై కమిటీ సభ్యుడు |
05 | 13 జూన్ 2014 | వ్యాపార సలహా కమిటీ సభ్యుడు | |
06 | 14 ఆగస్ట్ 2014 | 30 ఏప్రిల్ 2015 | షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు |
07 | 2014 | గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ - చైర్‌పర్సన్ | |
08 | 2014 | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు | |
09 | 2014 | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు | |
10 | 29 జనవరి 2015 | సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు | |
11 | 11 మే 2016 | సెక్యూరిటీ ఇంటరెస్ట్ అమలు & రుణాల రికవరీ చట్టాలు, ఇతర నిబంధనల (సవరణ) బిల్లు కమిటీ సభ్యుడు | |
12 | 2016 | జాయింట్ కమిటీ సభ్యుడు | |
13 | 23 సెప్టెంబర్ 2016 | సబ్-కమిటీ-VII సభ్యుడు | |
14 | 2016 | 2017 | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ "Biography". Lok Sabha Website.
- ↑ Eenadu (12 April 2024). "మెజారిటీ వీరులు.. చేదు అనుభవాలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.