పోకిమాన్ గో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పోకిమాన్ గో | |
---|---|
Developer(s) | Niantic |
Publisher(s) | Niantic |
Director(s) | |
Artist(s) | |
Composer(s) | |
Series | |
Engine | |
Platform(s) |
|
Release | July 6, 2016 |
Mode(s) | Single-player[Multi -player |
పోకిమాన్ గో గేమ్ ఉచితంగా మొబైల్ ప్రదేశం ఆధారంగా ఆడుకొనే సహజ మొబైల్ గేమ్ . దీనిని నిన్ టిక్ ఐ ఓ ఎస్, ఆండ్రాయిడ్ అధ్వర్యంలో రూపొందించారు. దీనిని వినియోగించుకోవడం కోసం అన్నీ ప్రదేశలలో వచ్చేల ప్రపంచ వ్యాప్తంగా జూలై 2016 నా రూపకల్పన చేసారు. కానీ భారతదేశం లో అధికారికంగా విడుదల చేయలేదు. అధికారికంగా ప్రారంభించక ముందే పోకీమాన్ గో వెఱ్ఱి భారతదేశాన్ని కూడా పట్టుకుంది. దీనిని ఆడాలంటే ముఖ్యంగా జిపీఎస్, కెమెరా ఫీచర్స్ మొబైల్ లో కలిగి ఉండాలి.
సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్ గేమ్ అయినా ఒకే దగ్గర కూర్చుని ఆడుకునే విధంగా ఉంటుంది. అది టీవీ, కంప్యూటర్ గేమ్ అయినా సరే. అన్నీ దాదాపుగా ఒకే ప్రదేశానికి పరిమితమవుతాయి. అయితే పోకిమాన్ గో గేమ్ మాత్రం అలా కాదు. ఈ గేమ్‌ను ఆడాలంటే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. బయట తిరుగుతూ గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరానికి వ్యాయామం చేసినట్టయి క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. ఈ గేమ్‌ను నిత్యం 45 నిమిషాల పాటు ఆడడం వల్ల ఎవరైనా వారానికి 1800 క్యాలరీలను ఈజీగా ఖర్చు చేయవచ్చట. దీంతో బరువు కూడా తగ్గుతారు. అందుకే ఈ గేమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
పోకిమాన్ ఆడటం
[మార్చు]పోకిమాన్ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ఫోన్‌లోని జీపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌లను ఆన్‌లో ఉంచాలి. [1] అనంతరం గేమ్‌ను స్టార్ట్ చేయాలి. దాంట్లో యూజర్ తన క్యారక్టర్‌ను ఎంచుకున్న తరువాత ఓ మ్యాప్ దర్శనమిస్తుంది. అందులో యూజర్ ఉన్న ప్రాంతం వివరాలు తెలుస్తాయి. అక్కడికి కొద్ది దూరంలో పోకిమాన్ భూతం ఉంటుంది. దాన్ని పట్టుకోవాలంటే మ్యాప్ సహాయంతో నడక లేదా పరుగు సాగించాలి. దాన్ని చేరుకోగానే గేమ్‌లో ఉండే బాల్‌తో దాన్ని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఇదంతా డివైస్‌లోనే జరుగుతుంది. కాకపోతే యూజర్ మ్యాప్‌కనుగుణంగా ఆయా ప్రదేశాలకు నడక లేదా రన్నింగ్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.
ప్రాణాలపై తెస్తున్న పోకిమాన్ గేమ్
[మార్చు]పిల్లల నుంచి పెద్దల వరకు ఎవర్ని చూసిన ఈ గేమ్‌లో నిమగ్నమైపోతున్నారు. ఫోన్‌లో కనిపించే పోకిమాన్‌ని పట్టుకోవడమే ఈ ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడుతున్నప్పుడు తల పక్కకు తిప్పుకోలేం. ఇది యువతకు ఎంతలా నచ్చేసిందంటే తాజాగా ఓ యువకుడు ఈ గేమ్ ఆడుతుండగా ఓ ఆగంతకుడు అతన్ని కత్తితో పొడిచి పారిపోయాడు. అయినా ఆ యువకుడు గేమ్‌లో నిమగ్నమైపోయాడు. ఓరెగాన్‌కి చెందిన మైకెల్ బేకర్ అనే యువకుడు ఓ పార్క్‌లో పోకెమాన్ గో గేమ్ ఆడుకుంటూ వెళుతున్నాడు. అక్కడికి వాకింగ్‌కి వచ్చిన ఓ వ్యక్తిని మీరు కూడా పోకిమాన్ గో ఆడుతున్నారా అని అడిగాడు. ఆ వ్యక్తి ఎందుకో కోపంతో కత్తితో బేకర్ భుజంపై పొడిచి పారిపోయాడు. రక్తం కారిపోతున్నా బేకర్ మాత్రం గేమ్ పూర్తిగా ఆడేవరకు ఆస్పత్రికి వెళ్లలేదు. ఆ తర్వాత తీరిగ్గా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోగా భుజానికి ఎనిమిది కుట్లు పడ్డాయి. ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఓ వ్యక్తి ఈ గేమ్ ఆడుకుంటూ వెళ్తూ ఓ చెరువులో పడిపోయాడు.
పోకిమాన్ గేమ్‌పై ఆంక్షలు
[మార్చు]గేమ్ బారిన పడి తప్పిపోవడం, ప్రమాదాల వల్ల చనిపోవడం లాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా సహజమయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ దీని ప్రభావం మరింతగా పెరుతోంది. ఈ గేమ్ ప్రభావానికి ఏకంగా ఇండోనేషియా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పోకోమాన్ గో ఎంత క్రేజీ గేమో అంతే ప్రమాదకరమని హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రమాద నివారణా చర్యలకు ఇండోనేషియా ప్రభుత్వం పూనుకుంది. విధుల్లో ఉండగా గేమ్ ఆడకూడదని పోలీస్, సైనిక విభాగాధిపతులకు ఆదేశాలు జారీచేసింది. సాయుధ దళాలు, భద్రతా సిబ్బంది విధినిర్వహణలో ఉన్నప్పుడు పోకిమాన్ గో ఆడడాన్ని పూర్తిగా నిషేదించింది. దీనికి సంబంధించి కార్యాలయ పరిసర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను కూడా పెట్టింది. సౌదీ అరేబియాకు చెందిన అత్యున్నత మత సంస్థ పోకిమాన్ పై 15 ఏళ్ల కిందటి ఫత్వాన్ని పునరుద్ధరించింది. ఈ ఫత్వాలో తాజాగా హల్ చల్ చేస్తున్న పోకిమాన్ గో మొబైల్ గేమ్ గురించిన ప్రస్తావన ఏమీ లేకపోయినా పోకిమాన్ గేమ్ ఇస్లాంకు వ్యతిరేకపమని ఆ ఫత్వాలో పేర్కొంది.
మూలాలు
[మార్చు]- ↑ Osworth, Ali. "Pokémon Go Came Out In the US, Let's Catch 'Em All". Autostraddle. Retrieved July 11, 2016.