పోతురాజు జడ్సన్
పోతురాజు జడ్సన్ | |
---|---|
జననం | హైదరాబాదు, తెలంగాణ | 1950 జూలై 28
ప్రసిద్ధి | కీటకశాస్ట్రంలో పరిశోధన |
పోతురాజు జడ్సన్ తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త.[1] 1970లలో డైస్‌డెర్కస్ సింగ్యులాటస్‌పై అనేక పరిశోధనలు చేశాడు.[2]
జననం
[మార్చు]పోతురాజు జడ్సన్ 1950, జూలై 28న తెలంగాణలోని హైదరాబాదు నగరంలో జన్మించాడు.
బోధనారంగం
[మార్చు]1956 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చట్టం ప్రకారం[3] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రం[4] బోధించాడు. ఇండియన్ సొసైటీ ఫర్ కంపారిటివ్ యానిమల్ ఫిజియాలజీలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.[5]
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగంలో[6] లెక్చరర్ గా, రీడర్ గా,[7] తర్వాత ప్రొఫెసర్, శాఖాధిపతిగా,[8] బోర్డ్ ఆఫ్ స్టడీస్[9] ఛైర్‌పర్సన్ ఆఫ్ జువాలజీ[10] గా పనిచేశాడు. అంతకుముందు 1997లో,[11] సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌కి ప్రిన్సిపాల్[12][13][14] గా చేశాడు.
పరిశోధన
[మార్చు]జడ్సన్ వ్యాసాలు అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి. 1978లో ప్రచురించబడిన జడ్సన్ పరిశోధనా కథనాలలో ఒకటైన[15] బి. కిషన్ రావు, ఎస్ఎస్ ఠాకూర్, బి. జూయిలస్ దివాకర్‌లతో కలిసి ఎర్ర కాటన్ బగ్, డైస్‌డెర్కస్ సింగ్యులాటస్ (హెటెరోప్టెరా) పురుష పునరుత్పత్తి అవయవాలపై బాల్య హార్మోన్ అనలాగ్ ప్రభావాలు, సైంటిఫిక్ జర్నల్ ఎక్స్‌పీరియంటియా (సెల్యులార్ అండ్ మాలిక్యులర్ లైఫ్ సైన్సెస్ )[15] అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు,[16] అకాడమీలలో 500 కంటే ఎక్కువ[16] లైబ్రరీ హోల్డింగ్‌లలో ఉంచబడింది.[16] జర్మన్ అకడమిక్ జర్నల్ జైట్‌స్క్రిఫ్ట్ ఫర్ డై ఆల్టెస్టమెంట్లిచ్ విస్సెన్‌చాఫ్ట్ కి[17] పరిశోధనా కథనాన్ని అందించాడు.[17]
2007లో ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగం, సలీమ్ అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ సంయుక్తంగా నిర్వహించిన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ హ్యూమన్ వెల్-బీయింగ్ పై జరిగిన జాతీయ సదస్సు నిర్వహణలో సహకారం అందించాడు.[18] 2008లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ హ్యూమన్ వెల్-బీయింగ్ అనే సంకలనానికి సహ-సంపాదకత్వం వహించాడు.[19] 2009లో [20] సర్ రోనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారాసిటాలజీలో దోమల వల్ల కలిగే వ్యాధులు, ప్రజారోగ్యంపై దాని ప్రభావం[20] వాతావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై జాతీయ సింపోజియంను ఏర్పాటుచేశాడు.[20]
సామాజిక కార్యక్రమాలు
[మార్చు]2010వ దశకంలో కెనడియన్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్[21] ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో సామాజిక కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టాడు. అందులో ఫీల్డ్ స్టాఫ్,[22] టీమ్ మెంబర్‌గా ఉన్నాడు.[21] జడ్సన్ యూరోపియన్ బాప్టిస్ట్ మిషన్ ఇంటర్నేషనల్ ప్రస్తుత భారతదేశ ప్రతినిధి[23] దేశంలోని 16 మంది భాగస్వాములతో కలిసి సామాజిక కార్యాచరణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు.[24][25]
మూలాలు
[మార్చు]- ↑ Gordon W. King, Seed Falling on Good Soil: Rooting Our Lives in the Parables of Jesus, Cascade books, Eugene, 2016, p.83.
- ↑ Universities Handbook, Volume 2, Association of Indian Universities, New Delhi, 2006, p.931.
- ↑ University Grants Commission, List of Universities under Section 2(f) and Section 3 of the UGC Act, 1956.
- ↑ K. Moshi Raju, K. Rudrama Devi and P. Minny Jael, Garlic extract prevents chromium induced cytogenetic damage in somatic cells of mice, Journal of Research in Environmental Science and Toxicology, Volume 1(6), July 2012, pp. 131-136.
- ↑ Indian Journal of Comparative Animal Physiology, Volumes 8-11, 1990, p.68.
- ↑ Indian Science Abstracts, Volume 17, 1981, p.894
- ↑ Commonwealth Universities Yearbook, Volume 2, 1993, p.1464
- ↑ National Symposium on implications of climate change on mosquito-borne diseases and its impact on public health, August 2009.
- ↑ A brief report on the two-day lecture workshop on "current trends" in animal biology and biotechnology, February, 2010.
- ↑ M. Moshe Raju and K. Rudrama Devi, Modulating Effects of Curcumin on Chromium Induced Chromosomal Aberrations in Somatic Cells of Mice in Nature Environment and Pollution Technology, Volume 9, Number 4, 2010, pp.813-817.
- ↑ "University College of Science, Saifabad, Principal's message". Archived from the original on 2023-07-29. Retrieved 2023-07-29.
- ↑ P. Ramachandra Reddy, P. Padma Rao, A survey of plant crude drugs in folklore from Ranga Reddy district, Andhra Pradesh, India in Indian Journal of Traditional Knowledge, Volume 1(1), October 2002, pp.20-25.
- ↑ Ethnobotany: Journal of Society of Ethnobotanists, Volumes 9-12, 1997, p.108.
- ↑ Masanori Abe, Yohtaro Yamazaki (Compiled), Ferrites: proceedings of ICF 8 ; main conference, Sept. 18-Sept.21, 2000, Kyoto, Japan ; satellite conference, Sept. 25-Sept.27, 2000, Tokyo, Japan, 2000, p.234.
- ↑ 15.0 15.1 P. Judson, B. Kishen Rao, S. S. Thakur and B. Juilus Divakar, The effects of a juvenile hormone analogue on the male reproductive organs of the red cotton bug, Dysdercus cingulatus (Heteroptera) in Experientia, Volume 34, Issue 6, 1978, pp.817-818..
- ↑ 16.0 16.1 16.2 WorldCat: The effects of a juvenile hormone analogue on the male reproductive organs of the red cotton bug, Dysdercus cingulatus (Heteroptera).
- ↑ 17.0 17.1 P. Judson, B. Kishen Rao, S. S. Thakur, B. Julius Divakar, Histological changes in the ovaries of Dysdercus cingulatus (F.) caused by the "paper factor" in Zeitschrift für mikroskopisch-anatomische Forschung, Volume 92, Issue 3, 1978, pp.541-546.
- ↑ Annual Report 2006-2007, Sálim Ali Centre for Ornithology and Natural History, Coimbatore, 2007.
- ↑ B. Raghavendra Rao, S.N. Prasad, C. Srinivasulu and P. Judson (Edited), Biodiversity Conservation and Human Well-Being, Department of Zoology, OU, Hyderabad, 2008.
- ↑ 20.0 20.1 20.2 National Symposium on implications of climate change on mosquito-borne diseases and its impact on public health, August 2009.
- ↑ 21.0 21.1 2013 Year Book of the Convention of Atlantic Baptist Churches, 2013, p.F-2.
- ↑ Cut to the Chaise, Seeing is believing, 2012
- ↑ Europäische Baptistische Mission, EBM Schweiz, 2015[permanent dead link]
- ↑ Ebm magazin, Vol. 3 (13), December 17, 2013
- ↑ Matthias Dichristin, Stories from the Missionfield - Encounters in a Fishing Village, February 2019.