పోపూరి పూర్ణచంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోపూరి పూర్ణచంద్రరావు

పోపూరి పూర్ణచంద్రరావు స్వచ్ఛంద సంఘసేవకుడు.[1] విరాళాల ద్వారా కోట్ల రూపాయలు సమీకరించి నైస్ (నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌) అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు విద్యాదానం చేస్తున్నాడు. 2002లో పదిమంది పిల్లలతో ప్రారంభమైన ఈ పాఠశాలలో 2017లో 250 మంది పైగా పిల్లలున్నారు. ఈ సంస్థ పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం లోని మైనంపాడు గ్రామంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న వివిధ సేవాసంస్థలను సందర్శించి అందులో ఉన్న మంచి పద్ధతులను ఇక్కడ అమల్లో పెట్టడం విశేషం.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పోపూరి పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. డిగ్రీ పూర్తవగానే ఉద్యోగం కోసం అతను హైదరాబాదు చేరాడు. ప్రైవేటు కంపెనీల్లో చిన్న ఉద్యోగాలు చేశాడు. ఒకసారి పనిచేస్తున్న చోట కంటికి దెబ్బ తగిలి ఓ కన్ను చూపు పోయింది. కానీ యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు. రైల్వే స్టేషన్లలో అనాథలుగా తిరిగే పిల్లలకోసం ఏమన్నా చేయాలన్న ఆలోచనతో పదిహేనేళ్ళలో 80 వేల మందిని కలిసి పదికోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. ‘నైస్‌’ ‘నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌’ అనే సంస్థకు సొంత భవనం కట్టించి కోటి రూపాయల కార్పస్‌ ఫండ్‌ ఏర్పరిచారు. అనాథ పిల్లలకు వసతి, భోజన, విద్యాసౌకర్యాలు కల్పిస్తుందీ సంస్థ. 2002లో పదిమంది పిల్లలతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఇప్పుడు 250 మంది పిల్లలున్నారు. వారిలో అరవై మంది ఆడపిల్లలు. సీబీఎస్‌ఈ విధానంలో నడుస్తున్న ఈ పాఠశాల పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని కనపర్రు శివారు మైనంపాడు గ్రామంలో ఉంది. రిషీవ్యాలీతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలలను సందర్శించిన పూర్ణచంద్రరావు అన్ని చోట్లా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి వాటిలో మంచివి అనుకున్న పద్ధతులను ఎంచుకుని తమ పాఠశాలలో ఆచరిస్తున్నారు.అతనికి మాత్రం... సొంత ఇల్లు లేదు. రూపాయి జీతం తీసుకోరు. రెండు గదుల అద్దె ఇంట్లో ఉంటూ తన పిల్లల్ని దాతల సహాయంతో చదివిస్తున్నారు.

ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో ఓ నిరాడంబరమైన ఇంటిలో తల్లి, భార్య, ఇద్దరు బిడ్డలతో నివసిస్తున్నారు. అతని భార్య జయలక్ష్మి ఉద్యోగమే వారి కుటుంబానికి జీవనాధారం. పూర్ణచంద్రరావు సొంతూళ్ళో వారికి చిన్న ఇల్లుండేది. అది అమ్మగా వచ్చిన డబ్బుతో స్కూలు కోసం స్థలం కొన్నాడు. సంస్థ పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించాడు. విరాళాలతో మరింత స్థలం కొని సొంతభవనం నిర్మించాడు.దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ రసీదు ఇస్తారు. వార్షిక నివేదికలో రాస్తారు. ఏటా ఆడిటింగ్‌ చేయిస్తారు. దాతల డబ్బుతో సమకూర్చిన ఆస్తులన్నీ సంస్థ పేరునే ఉన్నాయి. అతను పేరున ఏదీ లేదు. కార్యాలయ నిర్వహణ ఖర్చు లేకుండా తన ఇంటినుంచే పనిచేస్తాడు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అనాథ పిల్లలను గ్రామ, మండల స్థాయి అధికారుల సిఫార్సుతో ఈ సంస్థలో చేర్చుకుంటున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయి దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. తమ దృష్టికి వచ్చిన పిల్లల గురించి ఎవరైనా అతనకు సమాచారం ఇవ్వచ్చు. పదేళ్లకు అటూ ఇటూగా ఉంటే చేర్పించుకుంటారు. చదువు పూర్తై ఉద్యోగంలో స్థిరపడేవరకూ వారి బాధ్యత సంస్థదే. వీరి స్కూల్లో కులమత ప్రస్తావన ఉండదు. ఏటా మే 6న ఆలుమ్ని దినోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు అందరూ కలుసుకుని సరదాగా గడుపుతారు.[2]

Now, my school shelters only boys. Orphaned girls are the worst hit in our country. At a very tender age, they are victims of worst exploitation, malnutrition, rape and murder. I look forward to start a residential school for such girl-children. I know for this, I require a lot of public support. I don’t rest till I achieve this goal,” Poornachandra Rao

మూలాలు

[మార్చు]
  1. "ఇలాంటివారు.. కోటికి ఒకరు...!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 16 April 2017. Retrieved 16 April 2017.
  2. "ఐడిల్ బ్రెయిన్ లో పూర్ణచంద్రరావు గురించి". Archived from the original on 2017-04-19. Retrieved 2017-04-16.