Jump to content

పోలిమెట్ల

అక్షాంశ రేఖాంశాలు: 16°21′51″N 81°00′31″E / 16.364287°N 81.008579°E / 16.364287; 81.008579
వికీపీడియా నుండి

"పోలిమెట్ల" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పోలిమెట్ల
—  రెవెన్యూయేతర గ్రామం  —
పోలిమెట్ల is located in Andhra Pradesh
పోలిమెట్ల
పోలిమెట్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°21′51″N 81°00′31″E / 16.364287°N 81.008579°E / 16.364287; 81.008579
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 356
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

మంచినీటి చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఆరు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో 2016, మే-17న, 9.3 లక్షల అంచనావ్యయంతో, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [3]

ఊరచెరువు:- గ్రామములోని శ్రీరామాలయం ఎదురుగా ఉన్న ఈ చెరువులో, ఈ గ్రామవాసి, పాలిటెక్నిక్ పూర్వ అధ్యాపకుడు శ్రీ పర్వతనేని రామకృష్ణ, ఒక లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన రేవును ప్రారంభించారు. [4]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. అట్లూరి శ్రీరామచంద్రప్రసాదు, మాజీ సర్పంచి.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో అట్లూరి పద్మావతి, సర్పంచిగా ఎన్నికైంది. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రామాలయం.

గ్రామ విశేషాలు

[మార్చు]

హైదరాబాదులోని "డైరీ ట్రీట్" అను ఐస్ క్రీం సంస్థకు ఎం.డి.అయిన, ఈ గ్రామానికి చెందిన, మండవ రాంబాబు, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ సిటీ) గా అభివృద్ధిచేయడానికై ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]

ఈ గ్రామములో అట్లూరి సుందరరామయ్య అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఇతను ఇంతకు ముందు, 12 సంవత్సరాలుపాటు, ఈ గ్రామ సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేసారు. 2017, జనవరి-1న, ఆయన శతాధిక మహోత్సవాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు ఆయన తన పనులు తనే చేసుకుంటున్నారు. ఇతను 2017, మార్చి-23న గ్రామంలో, హఠాత్తుగా కన్నుమూసారు. [5]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-19; 26వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-28; 25వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-18; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, అక్టోబరు-11; 2వపేజీ.[5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మార్చి-24; 2వపేజీ.