ప్రకాష్ అబిత్కర్
ప్రకాష్ అబిత్కర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | కృష్ణారావు పాటిల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాధానగరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఆనందరావు అబిత్కర్ | ||
పూర్వ విద్యార్థి | శివాజీ యూనివర్సిటీ , కొల్హాపూర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రకాష్ రావు అబిత్కర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాధానగరి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రకాష్ రావు అబిత్కర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ టికెట్ ఆశించగా దక్కకపోవడంతో రాధానగరి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాధానగరి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి కె.పి. పాటిల్‌పై 39408 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
ప్రకాష్ రావు అబిత్కర్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి కె.పి. పాటిల్‌పై 18430 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి కె.పి. పాటిల్‌పై 38259 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ Loksatta (8 November 2022). "प्रकाश आबिटकर : विकास आणि जनतेशी नाळ". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Radhanagari". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)