Jump to content

కృష్ణారావు పాటిల్

వికీపీడియా నుండి
కృష్ణారావు పాటిల్

పదవీ కాలం
2004 – 2014
ముందు బజరంగ్ దేశాయ్
తరువాత ప్రకాష్ అబిత్కర్
నియోజకవర్గం రాధానగరి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)[1]
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కృష్ణారావు పరాశరామ్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాధానగరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కె.పి. పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాధానగరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేశాయ్ బజరంగ్ ఆనందరావు చేతిలో 7655 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004లో ఎన్నికలలో ఎన్‌సీపీ టికెట్ ఆశించగా దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేశాయ్ బజరంగ్ ఆనందరావుపై 55340 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

కె.పి. పాటిల్ 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాధానగరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేశాయ్ బజరంగ్ ఆనందరావు చేతిలో 41722 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత 2014, 2019, 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ప్రకాష్ అబిత్కర్ చేతిలో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (24 October 2024). "NCP's K P Patil joins Sena (UBT)". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 1 October 2010.
  3. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Radhanagari". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.