ప్రతాప్ సింగ్ (జైపూర్)
ప్రతాప్ సింగ్ ( 1764 డిసెంబరు 2 - 1803 ఆగస్టు 1) జైపూర్ కచ్వాహా పాలకుడు. ఈయన హవా మహల్‌ను నిర్మించి ప్రసిద్ధి చెందాడు.[1]
జననం
[మార్చు]ప్రతాప్ 1764 డిసెంబరు 2న మాధో సింగ్ I కు చిన్న కొడుకుగా జన్మించాడు. ప్రతాప్ సింగ్ తన సోదరుడు పృథ్వీ సింగ్ మరణం తరువాత 14 సంవత్సరాల వయస్సులో మహారాజు అయ్యాడు. అతను 1778 నుండి 1803 వరకు రాజ్యపాలన చేశాడు. అతని 25 సంవత్సరాల పాలనలో అనేక అద్భుతమైన విజయాలు సాధించాడు.
రచయితగా
[మార్చు]గోవింద్ దేవ్ ఆలయం వెనుక ఉన్న ఫౌంటైన్‌లు అతనికి, అతని కవితా ప్రతిభ, కళలు, చేతిపనుల ప్రోత్సాహానికి ఘనత తెచ్చాయి. ఆయన కాలంలోనే చిత్రకళ ఉచ్ఛస్థితికి చేరుకుంది. అతను సింహాసనాన్ని అధిరోహించే సమయానికి, మొఘల్ సామ్రాజ్యం దాదాపుగా అంతమైంది. కళాకారులు ఢిల్లీ నుండి పారిపోయారు. ప్రతాప్ సింగ్ వారికి ఆదరణ ఇవ్వడంతో వారు జైపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఈ కళాకారులే జైపురి చిత్రలేఖన పాఠశాలకు గుర్తింపు తెచ్చారు.
ప్రసిద్ధి
[మార్చు]హవా మహల్‌ను ప్రతాప్ సింగ్ నిర్మించాడు. హవా మహల్ ప్రత్యేకమైన స్మారక చిహ్నం, అతను నిర్మించిన సిటీ ప్యాలెస్‌లోని కొన్ని గదులను అతని అభిరుచికి అత్యుత్తమ ఉదాహరణగా చెబుతారు. ఆయన కాలంలోనే పెద్ద సంఖ్యలో పండిత రచనలు వెలువడ్డాయి. అతను స్వయంగా మంచి కవి. బ్రజ్, ధుందారీ భాషలలో బృజినిధి అనే కలం పేరుతో అనేక కావ్యాలు రాశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Works | NGV | View Work". www.ngv.vic.gov.au (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-21.