ప్రతీక్ష బక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతీక్ష బక్షి
జననం1970
వృత్తిఅసోసియేట్ ప్రొఫేసర్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్‌, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాజిక శాస్త్రవేత్త

ప్రతీక్షా బక్షి (జననం 1970) భారతీయ సామాజిక శాస్త్రవేత్త, పెమినిస్ట్ లీగర్ స్కాలర్. ఆమె పరిశోధన ప్రధానంగా న్యాయస్థానం విధానాలు, ఎథ్నోగ్రఫీ(ethnography), మహిళలపై లైంగిక హింసపై దృష్టి సారించింది.[1] ఆమె ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్‌లో ఫ్యాకల్టీ సభ్యురాలిగా ఉంది.[1]

కెరీర్[మార్చు]

ప్రతీక్ష బక్షి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో డాక్టరల్ డిగ్రీని పొందింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లా అండ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ నెట్‌వర్క్‌ను స్థాపించింది. ఇది చట్టం, సాంఘిక శాస్త్ర పరిశోధనపై వార్షిక ఇంటర్ డిసిప్లినరీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తుంది. బాన్‌లోని కేట్ హాంబర్గర్ సెంటర్, యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, భారతదేశంలోని యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ లకు ఆమె ఫెలోషిప్‌ మెంబర్.[2]

2014లో ఆమె పబ్లిక్ సీక్రెట్స్ ఆఫ్ ది లా: రేప్ ట్రయల్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ నుండి ప్రచురించింది. ఇది భారతదేశంలోని కోర్టు గదులపై ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన చేసి ప్రచురించి మొదటి రచనలలో ఒకటి. ఇందులో ముఖ్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ట్రయల్ కోర్టు నుండి అత్యాచార విచారణలపై దృష్టి సారించింది.[3] ఈ పుస్తకం పరిశోధనా ప్రచురణలలో సానుకూల సమీక్షలను అందుకుంది. లా & సొసైటీ రివ్యూ(Law & Society Review) దీనిని "భారతదేశంలో రేప్ ట్రయల్స్ ప్రజా జీవితం విశేషమైన అధ్యయనం" అని పేర్కొన్నది.[4] ది జర్నల్ ఆఫ్ ది ఇండియన్ లా ఇన్స్టిట్యూట్‌లో "స్త్రీవాద న్యాయ పరిశోధన రంగంలో మార్గదర్శక ప్రయత్నం" అని సమీక్షించారు.[5] ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఔట్‌లుక్ ఇండియాలో చట్టం, లైంగిక హింసపై పలు ఆర్టికల్స్ రాసింది.[6] వాటితో పాటుగా ఇండియన్ సోషియాలజీ, థర్డ్ వరల్డ్ క్వార్టర్లీ, అన్యువల్ రివ్యూ ఆఫ్ ఆంత్రోపాలజీ వంటి పలు అకడమిక్ జర్నల్స్ లలో కూడా పలు రచనలు చేసింది.[7]

అవార్డులు[మార్చు]

2021లో లైంగిక హింస, న్యాయశాస్త్రంపై చేసిన కృషికి ఆమె సామాజిక శాస్త్రాల విభాగంలో ఇన్ఫోసిస్ బహుమతిని గెలుచుకుంది.[8][9] ఈ బహుమతిని జాతీయ స్థాయిలో ప్రతీయేటా విజ్ఞాన, అధ్యయన రంగాల్లో విశిష్ట సేవలు, ఆవిష్కరణలు చేపట్టిన వారికి ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌(ఐఎస్‌ఎఫ్‌) అందిస్తుంది.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Faculty: Pratiksha Baxi". Jawaharlal Nehru University, Center for the Study of Law and Governance.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Pratiksha Baxi, Associate Professor, Centre for the Study of Law and Governance, JNU". Jawaharlal Nehru University.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Baxi, Pratiksha (2013). "Public Secrets of Law: Rape Trials in India - Oxford Scholarship". oxford.universitypressscholarship.com. doi:10.1093/acprof:oso/9780198089568.001.0001. ISBN 9780198089568. Retrieved 2020-11-26.
  4. Mitra, Durba (2015). "Review of Public Secrets of Law: Rape Trials in India". Law & Society Review. 49 (2): 535–537. doi:10.1111/lasr.12142. ISSN 0023-9216. JSTOR 43670485.
  5. Tellis, Ashley (2015). "Review of PUBLIC SECRETS OF LAW: RAPE TRIALS IN INDIA". Journal of the Indian Law Institute. 57 (1): 117–120. ISSN 0019-5731. JSTOR 44782493.
  6. "Articles by Pratiksha Baxi". outlookindia.com/. Retrieved 2020-11-26.
  7. Baxi, Pratiksha (2014). "Sexual Violence and Its Discontents". Annual Review of Anthropology. 43: 139–154. doi:10.1146/annurev-anthro-102313-030247. ISSN 0084-6570. JSTOR 43049567.
  8. "ISF announces Infosys Prize 2021 winners". @businessline (in ఇంగ్లీష్). 2 December 2021. Retrieved 2021-12-03.
  9. "Six achievers bag Infosys Science Awards". The New Indian Express. Retrieved 2021-12-03.
  10. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "EenaduPratibha: Current affairs on awards, Awards current affairs". EENADU PRATIBHA. Retrieved 2023-03-31.