ప్రత్యర్థి వారీగా భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు
భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) పూర్తి సభ్యురాలైన ఈ జట్టును[1] భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహిస్తుంది. [2] భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు తొలిసారిగా 1976లో స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆరు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడింది. పాట్నాలోని మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో వారు తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నారు; అయితే, ఆరో మ్యాచ్‌లో ఓడిపోవడంతో సిరీస్ సమమైంది. [3] 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్-ఆఫ్ సిరీస్‌లో భారత్ తమ తొలి విదేశీ విజయాన్ని సాధించింది. [4] 2022 అక్టోబరు నాటికి, వారు ఐదు వేర్వేరు ప్రత్యర్థులపై — ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ -38 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. విజయాల విషయానికొస్తే, వారు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై రెండేసి విజయాలతో అత్యంత విజయవంతమయ్యారు. [5] [6]
1978 ప్రపంచ కప్‌లో భారతదేశం తమ మొదటి మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ (WODI) మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఆడింది, [7] గ్రూప్ దశలో మిగిలిన రెండు గేమ్‌లలో ఓడిపోవడంతో వారు పట్టికలో దిగువన నిలిచారు. [8] [9] 1982 ప్రపంచ కప్‌లో, నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో 79 పరుగుల తేడాతో ఇంటర్నేషనల్ XIని ఓడించి వారి మొట్టమొదటి WODI మ్యాచ్‌లో విజయం సాధించింది. [10] [11] భారతదేశపు మొదటి విదేశీ WODI సిరీస్ విజయం 1994-95 న్యూజిలాండ్ మహిళల సెంటెనరీ టోర్నమెంట్‌లో వచ్చింది. 1999 ఇంగ్లాండ్ పర్యటనలో వారు WODI సిరీస్‌ను గెలుచుకున్నారు. [3] వారు 2005, 2017 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో రన్నరప్‌గా నిలిచారు. [12] 2022 అక్టోబరు నాటికి, వారు పన్నెండు వేర్వేరు ప్రత్యర్థులతో 301 WODIలు ఆడారు. అత్యధిక విజయాలు (164) సాధించిన జట్లలో నాల్గవ స్థానంలో ఉన్నారు; [13] T20 ఫార్మాట్‌లో వారు 81 విజయాలతో, అత్యంత విజయవంతమైన ఐదవ జట్టు. [14] 2006 ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ (WT20I) నుండి, భారతదేశం 151 మ్యాచ్‌లు ఆడింది. [15] బంగ్లాదేశ్‌పై పదకొండు విజయాలతో అత్యంత విజయవంతమయ్యారు. [16] 2009, 2010 ICC మహిళల ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్‌లలో సెమీ-ఫైనల్ దాకా వెళ్ళారు.[17] [18]
కీ
[మార్చు]
|
|
టెస్ట్ క్రికెట్
[మార్చు]ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | డ్రా | గెలుపు% | ఓటమి% | డ్రా% | తొలి | చివరి |
---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 10 | 0 | 4 | 6 | 0.00 | 40 | 60 | 1977 | 2021 |
ఇంగ్లాండు | 14 | 2 | 1 | 11 | 14.28 | 7.14 | 78.57 | 1986 | 2021 |
న్యూజీలాండ్ | 6 | 0 | 0 | 6 | 0.00 | 0.00 | 100.00 | 1977 | 2003 |
దక్షిణాఫ్రికా | 2 | 2 | 0 | 0 | 100.00 | 0.00 | 0.00 | 2002 | 2014 |
వెస్ట్ ఇండీస్ | 6 | 1 | 1 | 4 | 16.66 | 16.66 | 66.66 | 1976 | 1976 |
మొత్తం | 38 | 5 | 6 | 27 | 13.15 | 15.78 | 71.05 | 1976 | 2021 |
Statistics are correct as of ఆస్ట్రేలియా Women v India Women at Carrara as of Sep 30-Oct 3, 2021. |
వన్ డే ఇంటర్నేషనల్
[మార్చు]ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | టై | ఫతే | గెలుపు % | తొలి | చివరి | |
---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 50 | 10 | 40 | 0 | 0 | 20.00 | 1978 | 2022 | |
బంగ్లాదేశ్ | 5 | 5 | 0 | 0 | 0 | 100.00 | 2013 | 2022 | |
డెన్మార్క్ | 1 | 1 | 0 | 0 | 0 | 100.00 | 1993 | 1993 | |
ఇంగ్లాండు | 76 | 34 | 40 | 0 | 2 | 45.94 | 1978 | 2022 | |
International XI | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 | 1982 | 1982 | |
ఐర్లాండ్ | 12 | 12 | 0 | 0 | 0 | 100.00 | 1993 | 2017 | |
నెదర్లాండ్స్ | 3 | 3 | 0 | 0 | 0 | 100.00 | 1993 | 2000 | |
న్యూజీలాండ్ | 54 | 20 | 33 | 1 | 0 | 37.96 | 1978 | 2022 | |
పాకిస్తాన్ | 11 | 11 | 0 | 0 | 0 | 100.00 | 2005 | 2022 | |
దక్షిణాఫ్రికా | 28 | 15 | 12 | 0 | 1 | 57.55 | 1997 | 2022 | |
శ్రీలంక | 32 | 29 | 2 | 0 | 1 | 90.66 | 2000 | 2022 | |
వెస్ట్ ఇండీస్ | 26 | 21 | 5 | 0 | 0 | 80.76 | 1993 | 2022 | |
Total | 301 | 164 | 132 | 1 | 4 | 54.48 | 1978 | 2022 | |
Statistics are correct as of ఇంగ్లాండు women v India Women some at Lord's, 3rd ODI, September 24, 2022. |
ట్వంటీ20 ఇంటర్నేషనల్
[మార్చు]ప్రత్యర్థి | మ్యా | గె | ఓ | టై | Tie+W | Tie+L | NR | Win% | First | Last |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆస్ట్రేలియా | 31 | 6 | 23 | 0 | 1 | 0 | 1 | 19.35 | 2008 | 2023 |
బంగ్లాదేశ్ | 15 | 13 | 2 | 0 | 0 | 0 | 0 | 86.66 | 2013 | 2023 |
బార్బడోస్ | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2022 | 2022 |
ఇంగ్లాండు | 27 | 7 | 20 | 0 | 0 | 0 | 0 | 25.92 | 2006 | 2023 |
ఐర్లాండ్ | 2 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 100.00 | 2018 | 2023 |
మలేషియా | 2 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 100 | 2018 | 2022 |
న్యూజీలాండ్ | 13 | 4 | 9 | 0 | 0 | 0 | 0 | 30.76 | 2009 | 2022 |
పాకిస్తాన్ | 14 | 11 | 3 | 0 | 0 | 0 | 0 | 78.57 | 2009 | 2023 |
దక్షిణాఫ్రికా | 16 | 9 | 5 | 0 | 0 | 0 | 2 | 56.25 | 2014 | 2023 |
శ్రీలంక | 23 | 18 | 4 | 0 | 0 | 0 | 1 | 81.81 | 2009 | 2022 |
థాయిలాండ్ | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 100 | 2018 | 2022 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 100 | 2022 | 2023 |
వెస్ట్ ఇండీస్ | 21 | 13 | 8 | 0 | 0 | 0 | 0 | 61.93 | 2011 | 2019 |
Total | 169 | 90 | 74 | 0 | 1 | 0 | 4 | 53.25 | 2006 | 2023 |
Statistics are correct as of India Women v బంగ్లాదేశ్ Women some at Mirpur Ground, 2nd T20i, July 11, 2023. |
మూలాలు
[మార్చు]- ↑ Williamson, Martin (18 May 2007). "International Cricket Council: A brief history ..." ESPNcricinfo. Archived from the original on 9 August 2017. Retrieved 10 October 2017.
- ↑ "BCCI finally takes full control of India women's cricket". ESPNcricinfo. 13 November 2006. Archived from the original on 10 October 2017. Retrieved 10 October 2017.
- ↑ 3.0 3.1 Shubangi, Kulkarni (8 September 2000). "The history of Indian women's cricket". ESPNcricinfo. Archived from the original on 3 August 2017. Retrieved 7 September 2017.
- ↑ "Statistics / Statsguru / Women's Test matches / Aggregate/overall records". ESPNcricinfo. Archived from the original on 17 September 2016. Retrieved 10 March 2017.
- ↑ 5.0 5.1 "India Women / Records / Women's Test Matches / Result Summary". ESPNcricinfo. Archived from the original on 7 September 2017. Retrieved 7 September 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "India WTest record by opponent" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 6.0 6.1 "Records / Women's Test Matches / Team Records / Results Summary". ESPNcricinfo. Archived from the original on 23 September 2017. Retrieved 19 October 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "WTest result summary" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Statistics / Statsguru / Women's One Day Internationals / Aggregate/overall records". ESPNcricinfo. Archived from the original on 7 September 2017. Retrieved 7 September 2017.
- ↑ "Records / 1978 – India Women / Women's One Day Internationals / Match Results". ESPNcricinfo. Archived from the original on 7 September 2017. Retrieved 6 September 2017.
- ↑ "1978 Women's World Cup / Points Table". ESPNcricinfo. Archived from the original on 20 October 2017. Retrieved 20 October 2017.
- ↑ "Statistics / Statsguru / Women's One Day Internationals / Aggregate/Overall Records". ESPNcricinfo. Archived from the original on 21 October 2017. Retrieved 20 October 2017.
- ↑ "Records / 1982 – India women's One Day Internationals / Match Results". ESPNcricinfo. Archived from the original on 20 October 2017. Retrieved 20 October 2017.
- ↑ Thompson, Jenny. "A brief history ..." ESPNcricinfo. Archived from the original on 7 September 2017. Retrieved 7 September 2017.
- ↑ 13.0 13.1 "Records / Women's One Day Internationals / Team Records / Results Summary". ESPNcricinfo. Archived from the original on 21 February 2017. Retrieved 19 October 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "WODI result summary" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Records / Women's Twenty20 Internationals / Team Records / Results Summary". ESPNcricinfo. Archived from the original on 20 December 2016. Retrieved 7 September 2017.
- ↑ "Statistics / Statsguru / Women's Twenty20 Internationals / Aggregate / Overall Records". ESPNcricinfo. Archived from the original on 21 October 2017. Retrieved 20 October 2017.
- ↑ 16.0 16.1 "India Women / Records / Women's Twenty20 Internationals / Result Summary". ESPNcricinfo. Archived from the original on 22 October 2016. Retrieved 7 September 2017. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "India WT20I record by opponent" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Women's World Twenty20, 2009". Wisden Cricketers' Almanack. reprinted by ESPNcricinfo. 20 August 2010. Archived from the original on 14 May 2013. Retrieved 2 September 2017.
- ↑ English, Peter (13 May 2010). "Blackwell steers Australia into final". ESPNcricinfo. Archived from the original on 10 April 2016. Retrieved 2 September 2017.
- ↑ "India Women / Records / Women's One Day Internationals / Result Summary". ESPNcricinfo. Archived from the original on 22 October 2016. Retrieved 7 September 2017.
- ↑ "Records / Women's Twenty20 Internationals / Team Records / Results Summary". ESPNcricinfo. Archived from the original on 31 August 2017. Retrieved 20 October 2017.