దోమకొండ సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైట్‌ను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:నిజామాబాదు జిల్లా సంస్థానాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
'''దోమకొండ సంస్థానం''' [[తెలంగాణా]]లోని ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్న సంస్థానం. దోమకొండ నిజామాబాదు జిల్లాలో ఉన్నది. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. ఈ సంస్థానానికి బిక్కనవోలు (మెదక్ జిల్లా) సంస్థానమని కూడా నామాంతరం కలదు. ఈ సంస్థానాధీశులు తొలుత గోల్కొండ సుల్తానులకు, ఆ తరువాత అసఫ్‌జాహీలకు సామంతులుగా, దోమకొండ కేంద్రంగా కాసాపురం, సంగమేశ్వరం, మహ్మదాపురం, విస్సన్నపల్లి, బాగోత్‌పల్లి, కుందారం, పాల్వంచ, దేవునిపల్లి వంటి నలభై గ్రామాలను పాలించారు.<ref>[http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/aug/7/telangana&more=2011/aug/7/sundaymain తెలంగాణ గడీలు - 6 రెడ్డి దొరల కళావైభోగం దోమకొండ గడీ - ఆంధ్రజ్యోతి]</ref> 19వ శతాబ్దంలో ఈ సంస్థానపు సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు. అందుకే దోమకొండ కోశాగారానికి కాపలాగా ఇరవై మంది అరబ్బులు ఉండేవారట. వీరు రెడ్డిదొరలైనప్పటికీ నిజాం ప్రభువులు వీరికి ''రావుబహద్దూర్'' అనే బిరుదు ఇవ్వడంతో కొంతమంది పాలకులు పేరు చివర రావు అన్న పేరుతో చలామణీ అయ్యారు.
 
1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. ఈ వంశానికి చెందిన రాజన్న చౌదరి 1760 కాలంలో రాజధానిని బిక్కనవోలు నుండి కామారెడ్డిపేటకు, ఇతని కుమారుడు రాజేశ్వరరావు కాలంలో కామారెడ్డి పేట నుండి దోమకొండకు మారినది. అప్పటి నుండి దోమకొండ సంస్థానంగా ప్రసిద్ధి చెందింది.<ref>[http://www.maganti.org/chitraindex/pics/raja/domakonda.pdf ఆంధ్ర సంస్థానములు: సాహిత్యపోషణము - తూమాటి దొణప్ప]</ref> సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందకం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
 
==కామినేని వంశము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1188162" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ